News


హుష్‌.. రుపీ- 76నూ కోల్పోయింది

Monday 23rd March 2020
Markets_main1584941624.png-32630

95 పైసల పతనం
76.20కు జారిన రూపాయి
సరికొత్త కనిష్టమిది

కరోనా సునామీ.. దేశీ కరెన్సీకీ షాకిస్తోంది. ఇప్పటికే ఫారెక్స్‌ మార్కెట్ చరిత్రలో రూపాయి తొలిసారి 75 మార్క్‌ను తాకగా.. తాజాగా 76 కంటే దిగువకు పడిపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఉదయం 10.40 ప్రాంతంలో 95 పైసలు కోల్పోయింది. డాలరుతో మారకంలో 76.15ను తాకింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం.  కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ షట్‌డౌన్‌ బాటలో సాగుతుండటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనున్న అంచనాలు అటు స్టాక్‌ మార్కెట్లను, ముడిచమురు ధరలనూ దెబ్బతీస్తుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ సైతం పతన బాటలో సాగుతోంది.  కాగా.. కొద్ది రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో నిరవధిక అమ్మకాలు చేపడుతుండటం కూడా రూపాయిని దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రూపాయి శుక్రవారం 75.20 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.  కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 390కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు ఫారెక్స్‌ వర్గాలు చెబుతున్నాయి. 

రూ. లక్ష కోట్లు
దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ మార్చి నెలలోనే ఇప్పటివరకూ ఏకంగా రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. కాగా.. వారం రోజుల్లోనే అంటే మార్చి 13కల్లా విదేశీ మారక నిల్వలు సైతం 482 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు తెలియజేశాయి. గత ఆరు నెలల్లో ఇవి కనిష్టమని నిపుణులు పేర్కొన్నారు. ఈ నెల 6న ఇవి 487 బిలియన్‌ డాలర్లను దాటడం ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడం విశేషం! వెరసి వారం రోజుల్లోనే 5.7 బిలయన్‌ డాలర్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ ఇటీవల రూపాయికి దన్నుగా చేపట్టిన చర్యలు తదితర అంశాలను ఈ సందర్భంగా మార్కెట్‌ విశ్లేషకులు ప్రస్తావిస్తు్‌న్నారు. ఇలాంటి పలు అంశాలు రూపాయికి షాకిస్తున్నట్లు విశ్లేషకులు వివరించారు.You may be interested

ఆగని పతనం ..!

Monday 23rd March 2020

మార్కెట్లో కొనసాగుతున్న అమ్మకాలు  సుమారు 45 నిమిషాల​ట్రేడింగ్‌ నిలిపివేత తదుపరి ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు మళ్లీ భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం గం.10.42ని.ల వద్ద తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మార్కెట్లలో అదే అమ్మకాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ మునుపటి ముగింపు (29915.96)తో పోలిస్తే 3,414.60 పాయింట్లు (11.41 శాతం) నష్టపోవడంతో 26501.36 వద్ద,  నిఫ్టీ గత ముగింపు(8745.45)తో 968.15 పాయింట్ల(దాదాపు 11శాతం)ను కోల్పోయి 7778.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.   కరోనా భయాలు స్టాక్‌

స్వల్పంగా పెరిగిన పసిడి

Monday 23rd March 2020

 ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.10 పెరిగి  10 గ్రాముల పసిడి రూ.40,845.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,496.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (శుక్రవారం (స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌

Most from this category