News


72 దిగువకు రూ’పాయ్‌

Wednesday 8th January 2020
Markets_main1578457465.png-30755

ఇరాన్‌ దాడుల ఎఫెక్ట్‌
ప్రారంభంలోనే 20 పైసలు డౌన్‌

ముందుగా హెచ్చరించిన విధంగా ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై మిసైళ్లతో ఇరాన్‌ తాజాగా దాడులు చేయడంతో దేశీ కరెన్సీకి మరోసారి దెబ్బ తగిలింది. దీంతో ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి 20 పైసలు నీరసించింది. 72.02 వద్ద మొదలైంది. వెరసి రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 18 పైసలు(0.25 శాతం) బలహీనపడి 72 వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో గత వారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా సోమవారం సైతం రూపాయి ఇంట్రాడేలో 23 పైసలు క్షీణించి 72 దిగువకు చేరిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో స్టాక్‌ మార్కెట్లతోపాటు.. రూపాయి సైతం పుంజుకుంది. డాలరుతో మారకంలో 11 పైసలు బలపడింది. 71.82 వద్ద ముగిసింది. గత గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికన్‌ డ్రోన్‌ దాడుల కారణంగా ఇరానియన్‌ జనరల్‌ ఖాసిమ్‌తోపాటు ఇరాక్‌కు చెందిన అధికారులు కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదాడులకు దిగనున్నట్లు హెచ్చరించిన ఇరాన్‌ తాజాగా ఇరాక్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలపై మిసైళ్లను ప్రయోగించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.  

చమురు షాక్‌
ఇరాన్‌- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మూడు రోజులుగా అటు ముడిచమురు, ఇటు బంగారం ధరలు మండుతున్నాయి. తాజాగా బ్రెంట్‌ బ్యారల్‌ 70 డాలర్లకు చేరగా.. పసిడి  ఔన్స్‌1600 డాలర్లను అధిగమించింది. ఫలితంగా దేశీ కరెన్సీపై ఈ ప్రభావం కనిపిస్తున్నట్లు ఫారెక్స్‌వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా చమురు అవసరాల కోసం 75 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడటంతో డాలర్ల చెల్లింపులు పెరగనున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దిగుమతులు బిల్లు పెరగడంతో వాణిజ్యలోటు పెరగనుందని తెలియజేశారు. ఇలాంటి ప్రతికూల అంశాలు రూపాయిని దెబ్బతీస్తున్నట్లు వివరించారు. You may be interested

ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th January 2020

బ్యాంకు నిఫ్టీలో స్వల్ప రికవరీ బుధవారం బ్యాంకు నిఫ్టీ ఆరంభంలో దాదాపు 500 పాయింట్లు నష్టపోయి 30899 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే అనంతర ట్రేడింగ్‌లో క్రమంగా కోలుకొని 31220 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో దాదాపు 300 పాయింట్ల నష్టం నుంచి రికవరీ చెందినట్లయింది. కానీ ఈ రికవరీ తాత్కాలికమేనని బ్యాంకు నిఫ్టీ కీలక రైజింగ్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో

ఆర్‌కామ్‌కు రూ.104 కోట్లు తిరిగి ఇచ్చేయండి

Wednesday 8th January 2020

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉ‍న్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)కు స్వల్ప ఉపశమనం లభించింది. రూ.104 కోట్లను ఆర్‌కామ్‌కు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్‌కామ్‌కు రూ.104.34 కోట్లు తిరిగి చెల్లించాలంటూ టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గత డిసెంబర్‌ 21న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. స్పెక్ట్రమ్‌ సంబంధిత చెల్లింపుల్లో వరుసగా విఫలవడమే కాకుండా, దివాలా చర్యలను

Most from this category