News


ఇక 70-72 మధ్య రూపాయి

Saturday 17th August 2019
Markets_main1566018773.png-27828

  • శుక్రవారం 13 పైసలు లాభం
  • 71.14 వద్ద ముగింపు

ముంబై: రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ శుక్రవారం 13 పైసలు లాభపడి 71.14 వద్ద ముగిసింది. అయితే ఇది షార్ట్‌కవరింగ్‌గా భావించడం జరుగుతోందని, రూపాయి రానున్న పక్షం రోజుల్లో మరింత బలహీనపడే అవకాశాలే ఉన్నాయని విశ్లేషకులు అంచనా. సమీపకాలంలో 70-72 శ్రేణిలో తిరిగే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రూపాయి శుక్రవారం బలహీన ధోరణిలో 71.47 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.50నీ తాకింది.  డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం, క్రూడ్‌ ఆయిల్‌ పటిష్టత వంటి అంశాలు దీనికి కారణం. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్లు ‍కొంత బలపడ్డం తక్షణం రూపాయి సెంటిమెంట్‌ బలపడింది. మొత్తం వారంలో చూస్తే, రూపాయి 36 పైసలు నష్టపోయింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్‌ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. 



You may be interested

రెడీ టు కుక్‌ విభాగంలో ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌

Saturday 17th August 2019

కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో ప్లాంటు మంగమ్మ ఫుడ్స్‌ కో-ఫౌండర్‌ విశ్వనాథ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెడీ టు కుక్‌ ఫుడ్‌ విభాగంలోకి హైదరాబాద్‌కు చెందిన మంగమ్మ ఫుడ్స్‌ ప్రవేశించింది. ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌ పేరుతో చపాతీ, పూరీ, పరోటా శ్రేణిలో పలు రుచులను పరిచయం చేసింది. తమ ఉత్పత్తులకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ధ్రువీకరణ ఉందని మంగమ్మ ఫుడ్స్‌ కో-ఫౌండర్‌ నాగసాయి విశ్వనాథ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.

వడ్డీరేట్లు మరింత దిగివచ్చే చాన్స్‌!

Saturday 17th August 2019

అంతర్జాతీయ రేటింగ్‌  దిగ్గజం ఫిచ్‌ విశ్లేషణ మార్చి నాటికి 40 బేసిస్‌ పాయింట్ల  రెపో కోత అంచనా న్యూఢిల్లీ: భారత్‌లో వడ్డీరేట్లు మరింత దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 మార్చి) ముగిసే నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును మరో 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించే అవకాశం ఉందని  విశ్లేషించింది. ఇప్పటి

Most from this category