News


రూపాయికి ఆర్‌బీఐ బూస్ట్‌

Saturday 14th March 2020
Markets_main1584157941.png-32472

  • 48 పైసలు పురోగమనం
  • 73.80 వద్ద ముగింపు

ముంబై: ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో భయాందోళన పడాల్సింది ఏదీ లేదని, ఇందుకు తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నామనీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చిన హామీ శుక్రవారం రూపాయికి వరమయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడి 73.80 వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  • రూపాయి గురువారం ముగింపు 74.28
  • శుక్రవారం మరింత బలహీన ధోరణిలో 74.39 వద్ద ప్రారంభమైంది.
  • ఒకదశలో 74.50 స్థాయినీ చూసింది. 
  • అయితే ఆర్‌బీఐ హామీ నేపథ్యంలో  ట్రేడింగ్‌ చివరకు వచ్చే సరికి క్రితం ముగింపు 74.28తో పోల్చిచూస్తే, 48 పైసలు బలపడి 73.80 వద్ద ముగిసింది. సోమవారం 2 బిలియన్‌ డాలర్లను బ్యాంకింగ్‌కు విక్రయించనున్నట్లు కూడా ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

74.50ని చూసినా... చరిత్రాత్మక కనిష్ట ముగింపు 74.39
రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే, గురు, శుక్రవారాల్లో ఇంట్రాడేలో 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు  74.39 మాత్రమే. క్రూడ్‌ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్‌ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. నిజానికి అంతర్జాతీయ క్రూడ్‌ ధరల పతనం రూపాయి విలువకు సానుకూలం కావాల్సి ఉంది. అయితే చైనా కరోనా వైరస్‌ భయాలు, మొత్తంగా ప్రపంచ వృద్ధిపై   కోవిడ్‌-19 ప్రభావం పడుతుందన్న ఆందోళనలు, తాజా అమెరికా ట్రావెల్‌ బ్యాన్‌,  ఈక్విటీ మార్కెట్ల బలహీనత, సురక్షిత సాధనంగా డాలర్‌కు డిమాండ్‌  తత్సంబంధ అంశాలు రూపాయి తాజా బలహీనతకు కారణం. 


ఆర్‌బీఐ ఏమి చెప్పిందంటే..!
మార్కెట్‌ ‘‘సర్వ్యూట్‌ బ్రేకర్‌’’ నేపథ్యంలో ఆర్‌బీఐ ఒక కీలక ప్రకటన చేసింది. క్లుప్తంగా ఈ ప్రకటనను చూస్తే...‘‘ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగిన స్థాయిలో స్థిరంగా ఉండేందుకు తగిన చర్యలను అన్నింటినీ తీసుకుంటున్నాం. తద్వారా మనీ, డెట్‌, ఫారెక్స్‌ మార్కెట్లు ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేసేందుకు తగిన చర్యలు చేపట్టడం జరిగింది.  స్వల్పకాలికంగా ఎటువంటి ద్రవ్యలభ్యతా సమస్యలు తలెత్తకుండా డాలర్‌ అమ్మకం కొనుగోళ్ల స్వాప్‌ మార్గంలో వ్యవస్థలోకి రూ.25,000 కోట్లను విడుదల చేయడం జరిగింది.’’  You may be interested

వాణిజ్య రియల్టీ మీద కరోనా ప్రభావం

Saturday 14th March 2020

ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లావాదేవీల వాయిదా తగ్గిన సైట్‌ విజిట్స్‌; పెట్టుబడుల్లోనూ పునరాలోచన సాక్షి, హైదరాబాద్‌: దేశీయ వాణిజ్య స్థిరాస్తి రంగానికి కరోనా వైరస్‌ సోకింది. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో బహుళ జాతి కంపెనీలు సైట్‌ విజిట్స్‌ తగ్గించేశాయి. తుది దశకు చేరుకున్న లావాదేవీలను, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్‌ఎన్‌ఐ, ఎన్నారైలూ రియల్టీ పెట్టుబడులకు పునరాలోచనలో పడ్డారు. సింపుల్‌గా చెప్పాలంటే 2019లో రికార్డ్‌ స్థాయిలో జరిగిన కమర్షియల్‌ స్పేస్‌

పసిడీకి ‘‘వైరస్‌’’!

Saturday 14th March 2020

70 డాలర్లకు పైగా పతనం 2020 కనిష్ట స్థాయిలకు పయనం న్యూయార్క్‌: పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌- నైమెక్స్‌లో భారీ పతనాన్ని చూసింది. ఈ వార్తరాసే 11 గంటల సమయంలో పసిడి ధర 71 డాలర్ల నష్టంతో (4.5 శాతం) 1,520 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,504 డాలర్ల స్థాయికీ పడిపోయింది. 2020లో ఈ స్థాయికి పసిడి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Most from this category