News


రుపీ 72 దిగువకు

Monday 6th January 2020
Markets_main1578284248.png-30696

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్‌
ప్రారంభంలోనే 21 పైసలు డౌన్‌

మధ్యప్రాచ్యంలో గత వారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదరనున్న అంచనాల కారణంగా వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీకి షాక్‌ తగిలింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 21 పైసలు నీరసించింది. 72.01 వద్ద మొదలైంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 25 పైసలు(0.35 శాతం) బలహీనపడి 72.05 వద్ద ట్రేడవుతోంది. కాగా.. శుక్రవారం(4న) సైతం రూపాయి 42 పైసలు కోల్పోయి 71.80 వద్ద ముగిసింది. వెరసి రెండు రోజుల్లోనే రూపాయి మారకపు విలువకు 67 పైసలమేర కోత పడింది. గత గురువారం రాత్రి బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికన్‌ డ్రోన్‌ దాడుల కారణంగా ఇరానియన్‌ జనరల్‌ ఖాసిమ్‌తోపాటు ఇరాక్‌కు చెందిన అధికారులు కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చర్యలపై ఇరాన్‌ మండిపడుతోంది. ఫలితంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. 

చమురు దెబ్బ
ఇరాన్‌- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజులుగా అటు ముడిచమురు, ఇటు బంగారం ధరలు మండుతున్నాయి. రెండు రోజుల్లోనే చమురు ధరలు 7 శాతం జంప్‌చేయగా.. పసిడి సైతం 4 శాతం ఎగసిన విషయం విదితమే. తాజాగా లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు 70 డాలర్లను అధిగమించింది. ఈ ఎఫెక్ట్‌ దేశీ కరెన్సీపై కనిపిస్తున్నట్లు ఫారెక్స్‌వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా చమురు అవసరాల కోసం సింహభాగం దిగుమతులపైనే ఆధారపడటంతో డాలర్ల చెల్లింపులు పెరగనున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దిగుమతులు బిల్లు పెరగడంతో వాణిజ్యలోటు పెరగనుందని తెలియజేశారు. ఇలాంటి ప్రతికూల అంశాలు రూపాయిని దెబ్బతీస్తున్నట్లు వివరించారు. You may be interested

‘బేర్‌’మంటున్న బ్యాంకు నిఫ్టీ

Monday 6th January 2020

సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో బ్యాంకునిఫ్టీ భారీగా నష్టపోయింది. 31,910.45 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైన బ్యాంకునిఫ్టీ 31,914.45పాయింట్ల హైని నమోదు చేసి వెనువెంటనే పతనం కావడం ఆరంభించింది. ఉదయం 9.45 నిమిషాల సమయానికి 31,487.10 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 1. 53 శాతం నష్టంతో 31579 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సూచీలో వెయిటేజ్‌ ఉన్న బ్యాంకు స్టాకులన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. సూచీలో అత్యధికంగా పీఎన్‌బీ, బీఓబీ, ఎస్‌బీఐలు 3

పన్ను ఆదాకు చక్కని పథకం

Monday 6th January 2020

మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌  పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల నుంచి పొందొచ్చు.  ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్‌ పథకాల్లో మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్‌ పథకాల్లో చేసే పెట్టుబడులపై

Most from this category