News


68.85 వద్ద ప్రారంభమైన రూపీ

Wednesday 3rd July 2019
Markets_main1562127013.png-26748

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం(జులై 3) ట్రేడింగ్‌లో బలపడి 68.85 వద్ద ప్రారంభమైంది. ఈ వారం బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే దోరణిని అనుసరించడంతో గత సెషన్‌లో రూపీ ప్లాట్‌గా 68.93 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గినప్పటికి డాలర్‌ బలపడడంతో రూపీ ప్లాట్‌గానే ముగిసింది. అమెరికా తయారిరంగ వృద్ధి రేటు అంచనాల కంటే ఎక్కువగా ఉండడంతో పీఎమ్‌ఐ నివేదిక వెలువడిన తర్వాత డాలర్‌ మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. దీంతో పాటు అంతర్జాతీయ వృద్ధి మందగించడం, ఒత్తిడిలో ఉన్న భారతీయ బ్యాంకులు, వాణిజ్య భయాలు వలన రూపీలో కదలికలుండవచ్చు. అమెరికా ఫ్యాక్టరీ యాక్టివిటీ 51.7గా ఉందని ఐఎస్‌ఎమ్‌ తన నివేదికలో ప్రకటించింది. ఇది మార్కెట్‌ అంచనాల కంటే అధికం.  దీంతోపాటు విమానాల వివాదం కారణాన  400​కోట్ల అదనపు యూరోపియన్‌ యూనియన్‌ వస్తువులపై  సుంకాలను విధిస్తామని అమెరికా హెచ్చరించడం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. గత వారం చైనా- అమెరికా దేశాల మధ్య సంధీ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. జులైలో ఫెడ్‌ వడ్డి రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన అమెరికా-చైనా సంధీ వలన డాలర్‌కు మద్ధతు లభించనుంది. 
   అమెరికా-చైనా దేశాల మధ్య సంధీ కుదరడంతో ఆసియా కరెన్సీలతో పాటు జపాన్‌ కరెన్సీ ఎన్‌ కూడా సానుకూలంగా ట్రేడయ్యింది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  69.905 -68.80 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు. అమెరికా తయారిరంగ పీఎమ్‌ఐ అంచనాల కంటే మెరుగ్గా ఉండడంతో యూరో, పౌండ్‌ బలహీనపడ్డాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 3rd July 2019

వివిధ వార్తలకు సంబంధించిన బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు  షాపర్స్‌ స్టాప్‌:- ఆదిత్య బిర్లా సన్‌ లైన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలో 2శాతం వాటాను కొనుగోలు చేసింది. బీహెచ్‌ఈఎల్‌:- కంపెనీ  సీఎండీ నలిన్‌ సింఘాల్‌ నియామకం జరిగేంత వరకు ప్రస్తుతం డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న డి.బందోపాధ్యాయ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు.  కల్పతరు పవర్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌:- శుభమ్‌ లాజిస్టిక్స్‌లో మిగిలిన 20శాతం వాటాను రూ.65కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో మొత్తం వాటాను సొంతం

మరో పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 3rd July 2019

 ఆసియా మార్కెట్లు క్షీణతతో ట్రేడవుతున్నా, మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం భారత్‌ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా ఆరంభంకావడం వరుసగా ఇది మూడో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 91 పాయింట్ల పెరుగుదలతో 39,907 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 11,932 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బీపీసీఎల్‌, ఐఓసీ, ఆసియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌, యస్‌బ్యాంక్‌లు స్వల్పలాభంతో ప్రారంభంకాగా, ఐషర్‌ మోటార్స్‌,

Most from this category