News


71.90 వద్ద రూపీ ప్రారంభం

Thursday 29th August 2019
Markets_main1567051159.png-28079

 దేశియ రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు బలహీనపడి గురువారం 71.90 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్య భయాలు పెరగడంతో ఇన్వెస్టర్లు జపనీస్‌ యెన్‌ వంటి సురక్షితమైన ఆస్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 29 పైసలు బలహీనపడి 71.77 వద్ద ముగిసింది.  గత సెషన్‌లో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ 72.04 గా ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 16.52 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. ‘రూపీకి డాలర్‌ మారకంలో దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉంది. లాంగ్‌ పొజిషన్‌లు తీసుకోడానికి దీనిని ఉపయోగించుకోండి’ అని ఈ బ్రోకరేజి తెలిపింది. 



You may be interested

చమురు లాభాలకు బ్రేక్‌!

Thursday 29th August 2019

శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ మేరీ డాలీ యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో గురువారం ట్రేడింగ్‌లో  చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 30 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి బ్యారెల్ 60.19 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 15 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి 55.63 డాలర్లకు పడిపోయింది. కాగా గత సెషన్‌లో చమురు ధరలు 1.5 శాతం పెరగడం గమనార్హం.

11000 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 29th August 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 37300 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 11000 దిగువున 10,996.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ఆగస్ట్‌ నెల డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు తగ్గకపోవడంతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ (బ్రెగ్జిట్‌) ఉండకపోవచ్చనే ఊహాగానాలు

Most from this category