News


17 పైసలు బలపడిన రూపీ

Monday 15th July 2019
Markets_main1563164682.png-27055

దేశియ స్థూల ఆర్థిక వ్యవస్థ డేటా నిరుత్సాహ పరిచినప్పటికి సోమవారం(జులై 15) రూపీ డాలర్‌ మారకంలో 17 పైసలు బలపడి 68.52 వద్ద  ప్రారంభమైంది.  మైనింగ్‌, తయారిరంగాల వృద్ధి మందగించడంతో శుక్రవారం విడుదలైన పరిశ్రమ ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఫ్యాక్టరి ఔట్‌పుట్‌ వృద్ధి మే నెలలో 3.1 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో 4.3 శాతంగా నమోదైన విషయం గమనర్హం. అంతేకాకుండా రిటైల్‌ ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో 3.18 శాతానికి పెరిగింది. కానీ ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న పరిమితులలో ఉండడంతో వడ్డి రేట్ల కోతకు అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 25 పైసలు తగ్గి 68.69 వద్ద ముగిసింది. ఈ రోజు రూపీ డాలర్‌ మారకంలో 68.30-68.69 పరిధిలో కదలాడవచ్చని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజి సంస్థ అంచనావేసింది. 



You may be interested

స్థిరంగా పసిడి ధర

Monday 15th July 2019

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా కదలాడుతోంది. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప పెరుగుదలతో 1,413 డాలర్ల  వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా నేడు రెండో త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనంతో పాటు అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఈ క్యూ2లో చైనా దేశపు వృద్ధిరేటు

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 15th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  జెట్‌ ఎయిర్‌వేస్‌:- జూలై 16న క్రిడెట్‌ కమిటి తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. రుణదాతలు ఎన్‌సీఎల్‌టీ ద్వారా రిసెల్యూషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.  అలహదబాద్‌ బ్యాంక్‌:- భూషణ్‌ స్టీల్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ రూ.1175 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకు నివేదికనిచ్చింది. భెల్‌:- ఎన్‌టీసీసీ నుంచి ఈపీసీ విభాగంలో రూ.100 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. ఈ ఆర్డర్లలో భాగంగా కంపెనీ 25

Most from this category