News


కీలక సమావేశాల ముందు రూపీ బలహీనం

Wednesday 24th July 2019
Markets_main1563942812.png-27267

ప్రధాన కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్‌ బలపడడంతోపాటు, విదేశి పెట్టుబడుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో 15 పైసలు బలహీనపడి బుధవారం(జులై 24) ట్రేడింగ్‌లో 69.09 వద్ద ప్రారంభమైంది. ఈసీబీ(యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) పాలసీ నివేదిక గురువారం విడుదల కానుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 2 పైసలు తగ్గి 68.94 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడవ సెషన్‌లో కూడా రూపీ తక్కువ పరిధిలోనే కదలాడింది.  దేశియ మార్కెట్లు బలహీనంగా ఉండడం కూడా రూపీని ప్రభావితం చేసింది. 
  ఈసీబీ సమావేశం గురువారం జరగనుండడంతో పాటు, అమెరికా రెండవ త్రైమాసిక జీడీపీ ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. అంతేకాకుండా ఈ నెల 31 జరగనున్న ఫెడ్‌ సమావేశం కూడా రూపీని ప్రభావితం చేయనుంది.   
 ఈ ఏడాది, వచ్చే ఏడాదికి గాను అంతర్జాతీయ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ మంగళవారం తగ్గించింది.  అమెరికా- చైనా సుంకాలు మరింత పెరిగితే లేదా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్ క్రమరహితంగా నిష్క్రమించడం జరిగితే  వృద్ధి మరింత మందగించవచ్చని తెలిపింది.  అంతేకాకుండా ఇన్వెస్ట్‌మెంట్లు బలహీనపడడంతో పాటు సరఫరా గొలుసులకు అంతరాయం కలుగుతుందని వివరించింది.  2019 లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి 3.2 శాతం, 2020 లో 3.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ అంచనాలు ఈ ఏడాది ఏప్రిల్‌ అంచనాల కంటే 0.1 శాతం తక్కువ కావడం గమనర్హం.
   ఈ రోజు రూపీ డాలర్‌ మారకంలో 68.65- 69.20 పరిధిలో కదలాడవచ్చని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్  ఒక నివేదికలో తెలిపింది.You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు..

Wednesday 24th July 2019

ఈక్విటీ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.27 సమయానికి 2.42 శాతం నష్టపోయి 2,711.60    పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.77 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.95 శాతం, సెయిల్‌ 3.47 శాతం, వేదాంత లి. 3.24 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 3.17 శాతం, టాటా స్టీల్‌ 2.44 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 2.31 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావిమయ్యే షేర్ల వివరాలు  రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌:- ఎన్‌ఎస్‌ఈ ఎ‍క్చే‍్సంజ్‌ ఎఫ్‌అండ్‌ఓ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 27 నుంచి ఇది అమల్లోకి రానుంది.  స్టెరైడ్స్‌ ఫార్మా సైన్స్‌:- మే 29న బెంగూళూర్‌లో ఫార్మూలేషన్‌ ఫ్యాకల్టీ యూనిట్‌ను తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఈఐఆర్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. డెక్కెన్‌ హెల్త్‌కేర్‌:- జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించేందుకు తన అనుబంధ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందానికి​ బోర్డు ఏకగ్రీవంగా

Most from this category