News


71.17 వద్ద రూపీ ప్రారంభం

Monday 19th August 2019
Markets_main1566188813.png-27844

రూపీ డాలర్‌మారకంలో సోమవారం స్వల్పంగా బలహీనపడి 71.17 వద్ద ప్రారంభమైంది. కాగా అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడడంతో పాటు దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 13 పైసలు బలపడి 71.14 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.47 వద్ద కనిష్ఠాన్ని తాకి తిరిగి పుంజుకోవడం గమనార్హం.



You may be interested

తగ్గిన పసిడి ధరలు

Monday 19th August 2019

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధరలు తగ్గముఖం పట్టాయి. డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమమయ్యాయి. నేడు ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1520 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకు ఉద్దీపన చర్చలు ప్రకటించవచ్చనే అంచనాలతో అటు డాలర్‌తో పాటు ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. కిత్రం వారంలో

క్రూడ్‌ కేంద్రంపై దాడి..పెరిగిన చమురు

Monday 19th August 2019

సౌదీ చమురు కేంద్రంపై యెమెన్ వేర్పాటువాదులు శనివారం దాడి చేయడంతో సోమవారం(అగష్టు 19) ట్రేడింగ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. కానీ చమురు ధరల వృద్ధి తగ్గుదలను ఒపెక్ నివేదిక పేర్కొనడంతో, అంతర్జాతీయంగా చమురు డిమాండ్ ఆందోళనలు క్రూడ్‌ ఆయిల్‌ను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.8 శాతం పెరిగి బ్యారెల్‌ 59.09 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బ్యారెల్ 55.26 డాలర్లకు చేరుకున్నాయి.    తూర్పు సౌదీ అరేబియాలోని

Most from this category