News


ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 21st November 2019
Markets_main1574314148.png-29754

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో ప్లాట్‌గా 71.83 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆందోళనలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.81 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతల వలన అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌ మరింత ఆలస్యమవతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గురువారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ 71.86 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.84 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌

Thursday 21st November 2019

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,572.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అరశాతం పెరిగి 2,605.95 వద్ద చేరకుంది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,572.25)తో పోలిస్తే 0.25శాతం లాభంతో 2,578.65 వద్ద

వాటా విక్రయ వార్తలతో జీ మీడియా 15శాతం జం‍ప్‌

Thursday 21st November 2019

ముంబై:- ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 15శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.337.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 15శాతం పెరిగి రూ.353.20 పెరిగి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.324.10)తో పోలిస్తే 7శాతం లాభంతో రూ.328.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట,

Most from this category