News


వాణిజ్య చర్చలే రూపీని నడిపిస్తాయి!

Friday 29th November 2019
Markets_main1575000465.png-29943

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 71.61 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. చమురు దిగుమతి దారుల నుంచి నెల చివరిలో డాలర్‌ డిమాండ్‌ పెరగడంతో పాటు, శుక్రవారం దేశ జీడీపీ డేటా వెలువడనుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 25 పైసలు బలహీనపడి 71.60 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలపై సమీపకాలంలో రూపీ-డాలర్‌ కదలిక ఆధారపడి ఉందని విశ్లేషకులు తెలిపారు. హాంగ్‌కాంగ్‌ సమస్యలో అమెరికా జోక్యం చేసుకోవడం కొనసాగితే యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం కుదురుతుందో లేదోననే అనుమానాలున్నాయి’ అని ఆనంది రాఠీ షేర్స్‌, స్టాక్‌ బ్రోకర్స్‌, కరెన్సీ, కమోడిటీ రిసెర్చ్‌ ఎనలిస్ట్‌ రుషబ్‌ మారు అన్నారు. ‘వాణిజ్య చర్చలు విఫలమైతే, అమెరికా డిసెంబర్‌ 15 నుం‍చి చైనా ఉత్పత్తులపై సుంకాలను విధించడం కొనసాగిస్తుంది. అంతేకాకుండా వాణిజ్య చర్చలు విఫలమైతే చైనా తన కరెన్సీ యెన్‌ విలువను తగ్గించుకునే ప్రమాదం ఉంది. వాణిజ్య చర్చలు రూపీ కదలికను నిర్ధారించనున్నాయి’ అని ఆయన అన్నారు. వచ్చే నెలలో ఒపెక్‌(చమురు ఎగుమతి, దిగుమతి దేశాలు) దేశాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను పొడిగించే అవకాశం ఉండడంతో శుక్రవారం సెషన్‌లో చమురు ధరలు నిలకడగా కదులుతున్నాయి. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ 71.80 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 4.22 శాతం పెరిగిందని ఐసిఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌ పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది. 



You may be interested

డిసెంబర్‌లో బ్యాంకు షేర్లదే హవా?!

Friday 29th November 2019

డెరివేటివ్స్‌ గణాంకాల సూచన డిసెంబర్‌ సీరిస్‌లోకి నిఫ్టీ షేర్ల రోలోవర్‌ గత మూడు నెలల సరాసరి కన్నా ఎక్కువే ఉంది కానీ అక్టోబర్‌ రోలోవర్లతో పోలిస్తే తగ్గింది. ఇదే సమయంలో బ్యాంకు నిఫ్టీ రోలోవర్లు మూడు నెలల సరాసరికన్నా ఎక్కువగా ఉండడంతో పాటు అక్టోబర్‌ రోలోవర్ల కన్నా అధికంగా నమోదయ్యాయి. దీంతో ప్రధాన సూచీ కన్నా డిసెంబర్‌లో బ్యాంకు సూచీ ఎక్కువ దూసుకుపోయే ఛాన్సుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీలో రోలోవర్లు

నష్టాల ప్రారంభం

Friday 29th November 2019

ఆసియా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ఫలితంగా భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్ల నష్టంతో 41,070 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 12,126 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category