పడిపోయిన రూపీ
By Sakshi

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్ మారకంలో బుధవారం సెషన్లో 12 పైసలు బలహీనపడి 71.83 వద్ద ప్రారంభమైంది. కాగా చమురు ధరలు తగ్గడంతోపాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభపడడంతో గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో ప్రారంభ నష్టాల నుంచి కోలుకొని, చివరికి 13 పైసలు లాభపడి 71.71 వద్ద ముగిసింది. అధిక సరఫరా ఆందోళనలు పెరగడంతో గత సెషన్లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. గత సెషన్లో డాలర్-రూపీ నవంబర్ కాంట్రాక్ట్ ఎన్ఎస్ఈలో 71.75 వద్ద ఉందని, ఓపెన్ ఇంట్రెస్ట్ 2.41 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్ పేర్కొంది. డాలర్-రూపీ జంటకు అధిక స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.
You may be interested
మిడ్‌క్యాప్స్‌పై విదేశీ ఫండ్స్ మోజు
Wednesday 20th November 2019కొనుగోళ్లు పెంచుతున్న ఎఫ్‌పీఐలు రెండు సంవత్సరాలుగా కేవలం లార్జ్‌క్యాప్స్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుపుతూవస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా చిన్న స్టాకుల వైపు చూస్తున్నారు. ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద లభించే చిన్న స్టాకులు ఇచ్చే లాభాలను అందిపుచ్చుకోవడానికి ఎఫ్‌పీఐలు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యు2లో ఎఫ్‌పీఐలు దాదాపు 60కి పైగా మిడ్‌క్యాప్స్‌లో వాటాలు పెంచుకున్నాయి. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అధార్టీ, ఈస్ట్‌స్ప్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్, యూరో పసిఫిక్ గ్రోత్ ఫండ్, ఫిడిలిటీ, గవర్నమెంట్ పెన్షన్
రెండోరోజూ రిలయన్స్, ఎయిర్టెల్ షేర్ల ర్యాలీ
Wednesday 20th November 2019క్రితం సెషన్లో సూచీలకు లాభాల ముగింపునకు కారణమైన రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లోనూ శుభారంభం చేశాయి. రిలయన్స్ నిన్నటి ముగింపు(రూ.1510)తో పోలిస్తే 3శాతం లాభంతో 1555.05 వద్ద, ఎయిర్టెల్ 4.50శాతం పెరిగి రూ.426.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వచ్చే నెల నుంచి డేటా, టారీఫ్‌లను పెంచనున్నామని ప్రకటనతో టెలికాం షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్లు లాభాల