News


ప్లాట్‌గా రూపీ

Friday 22nd November 2019
Markets_main1574396133.png-29778

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్లో 71.75 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలహీనపడడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ నష్టాల నుంచి కోలుకొని చివరికి 5 పైసలు బలపడి 71.76 వద్ద ముగిసింది. యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగడంతో చమురు ధరలు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ గత సెషన్‌లో 71.79 వద్ద ఉండగా, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 12.18 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. గరిష్ఠ స్థాయిల వద్ద డాలర్‌-రూపీకి సరఫరా ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది. 



You may be interested

పండుగ సీజన్‌ ముగిసింది.. ఆటో షేర్లు కొనొచ్చా?

Friday 22nd November 2019

ఆటో కంపెనీల విక్రయాలకు జోష్‌నిచ్చే పండుగ సీజన్‌ ముగిసింది. దీంతో మరో రెండు మూడు నెలల పాటు నెలవారీ ఆటో విక్రయాలు సాధారణంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. ఆటో అమ్మకాల జోరు తగ్గే నేపథ్యంలో ఆటో కంపెనీల షేర్లపై నిపుణుల అభిప్రాయాలు మాత్రం బుల్లిష్‌గానే ఉన్నాయి. గతాన్ని పరికిస్తే ఆటో స్టాకులు పండుగ సీజన్‌ అనంతరం ఆటో షేర్ల జోరు కొనసాగడం కనిపిస్తుంది. నవంబర్‌, డిసెంబర్‌లో నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ ఆటో

వచ్చే నెల 10న బ్యాంక్‌ యూనియన్ల ధర్నా

Friday 22nd November 2019

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 10న పార్లమెంట్ ముందు భైఠాయించాలని బ్యాంక్‌ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్‌ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు

Most from this category