News


డాలర్‌ డిమాండ్‌..తగ్గిన రూపీ విలువ

Friday 16th August 2019
Markets_main1565931201.png-27799

బ్యాంకులు, దిగుమతిదారుల కొనుగోలు వలన యుఎస్‌ కరెన్సీకి డిమాండ్‌ పెరగడంతో దేశియ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో  శుక్రవారం 10 పైసలు బలహీనపడి 71.37 వద్ద ప్రారంభమైంది. దీనితో పాటు పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ గత సెషన్లో 6.58 శాతానికి తగ్గింది. ఇది అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో 6.62 శాతంగా ఉండడం గమనార్హం. యుఎస్ రిటైల్ అమ్మకాల పెరగడంతో డాలర్‌ బలపడుతోంది. ఈ రోజు, రూపీ డాలర్‌ మారకంలో 71.10- 71.80 పరిధిలో కదలునుందని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నివేదికలో తెలిపింది. చమురు ధరలు తగ్గడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో గత సెషన్‌లో(బుధవారం) రూపీ డాలర్‌ మారకంలో 13 పైసలు బలపడి 71.27 వద్ద ముగిసింది. 
   దేశ వాణిజ్య లోటు 13.43 బిలియన్ డాలర్లుగా నమోదైందని, గత ఏడాది ఇదే కాలంలో 18.63 బిలియన్ డాలర్లుగా ఉందని ఆర్థిక డేటా పేర్కొంది. దీనితో పాటు జూలైలో బంగారం దిగుమతులు 42.2 శాతం క్షీణించి 1.71 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. చమురు దిగుమతులు 22 శాతం తగ్గి 9.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, చమురేతర ఇంధన దిగుమతులు 6 శాతం తగ్గి 30.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 
  ‘దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేట్లు, స్వల్పకాలిక రుణాల స్థాయి కంటే తగ్గడంతో దేశియ కరెన్సీ బలహీనపడుతోంది. యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం వలన ప్రపంచ వృద్ధి మందగమనం  పెరగుతోందని ఇన్వెస్టర్లు ఇప్పటికి ఆందోళనలో ఉన్నారు’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.

 



You may be interested

పెరుగుతున్న పసిడి

Friday 16th August 2019

అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా  ప్రపంచమార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఆసియాలో ఔన్స్‌ పసిడి నేడు 7డాలర్లు పెరిగి 1,538 డాలర్లకు చేరుకుంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటంతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మొదలైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనాలైన బాండ్లు, పసిడి ఫ్యూచర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అమెరికా జూలై మాసపు రీటైల్‌ అమ్మకాల గణాంకాలు అంచనాలకు మించిన

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 16th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  భాష్‌ లిమిటెడ్‌:- రెండో త్రైమాసిక కాలం నుంచి  ప్రతి నెలలో 10రోజుల పాటు వివిధ ప్లాంట్లలో ‘‘నో ప్రాడెక్ట్స్‌ డే’’ పాటించనుంది. ఈ పదిరోజుల్లో ‘‘పవర్‌ట్రైన్‌ సెల్యూషన్స్‌ డివైజెస్‘‘ అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించనున్నట్లు కంపెనీ తెలిపింది.  యస్‌ బ్యాంక్‌:- క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.1,930 కోట్ల సమీకరణను పూర్తి చేసింది. ఆగస్ట్‌ 9న ప్రారంభమైన ఈ ఇష్యూకు 14వ తేదిన ముగిసినట్లు

Most from this category