News


71.35 వద్ద ప్రారంభమైన రూపీ

Thursday 19th September 2019
Markets_main1568865565.png-28425

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో గురువారం 11 పైసలు కోల్పోయి 71.35 వద్ద ప్రారంభమైంది. కాగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 54 పైసలు బలపడి 71.24 వద్ద ముగిసింది. దీంతో రూపీ  వరుస రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ వేసినట్టయ్యింది.



You may be interested

హైదరాబాద్‌-లండన్‌ వాణిజ్యం మరింత బలోపేతం..

Thursday 19th September 2019

ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఫిన్‌ టెక్‌) రంగంలో నూతన ఆవిష్కరణలను పెంపొందించండంలో భాగంగా లండన్ లార్డ్ మేయర్ పీటర్ ఎస్‌ట్లిన్‌ నగరంలో పర్యటించారు. హైదరాబాద్‌ - లండన్‌ల మధ్య ఫిన్‌ టెక్‌ విభాగంలో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసం టీ-హబ్‌ను సందర్శించారు. ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ దిగ్గజాలను కలిసి మాట్లాడారు. మంగళ, బుధవారాల్లో పర్యటించిన ఆయన ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎస్‌బీ) విద్యార్థులను పలకరించారు.

కో-లొకేషన్‌ కేసులో మీ సమాధానం ఏమిటి?

Thursday 19th September 2019

ఎన్‌ఎస్‌ఈ అధికారులకు శాట్‌ ఆదేశాలు ముంబై: కో-లొకేషన్‌ కేసు విషయంలో తమ వాదనలను సమగ్రంగా (రీజాయిండర్స్‌) నాలుగువారాల్లో తెలియజేయాలని   స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అధికారులకు సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఆదేశాలు జారీ చేసింది. అటు తర్వాత ఈ సమయాన్ని పెంచేదిలేదని స్పష్టం చేసింది. కేసు పరిష్కార తేదీన నవంబర్‌ 27గా ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. ఎన్‌ఎస్‌ఈ సీఈఓగా పనిచేసిన చిత్రా రామకృష్ణన్‌ కూడా ఈ ఆదేశాలు అందుకున్న వారిలో ఉన్నారు.

Most from this category