News


ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 1st November 2019
Markets_main1572583015.png-29279

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో స్వల్పంగా నష్టపోయి 70.98 వద్ద ప్రారంభమైంది. కాగా నెల చివరిలో డాలర్‌ డిమాండ్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 70.92 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో పాటు డాలర్‌ డిమాండ్‌ బలపడడంతో రూపీ సెంటిమెంట్‌ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలుండడంతోపాటు, ఫెడ్‌ వడ్డీ రేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించడంతో, గత వారం రోజుల నుంచి రూపీ డాలర్‌ మారకంలో 70.65-71.10 పరిధిలో కదలాడుతోంది’ అని ఏమ్కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, కరెన్సీ రిసెర్చ్‌ హెడ్‌ రాహుల్‌ గుప్తా అన్నారు. ‘యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌, బ్రెగ్జిట్‌ అంశాలు మందగమనాన్ని కొనసాగిస్తాయి. దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికి, 2020 లో ఫెడ్‌ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ముందుకెళ్లే కొద్ది డాలర్‌-రూపీ బెరిష్‌ దృక్పథంతో కదులుతుంది. 70.65 స్థాయి కీలక మద్ధతు స్థాయిగా పనిచేస్తుంది. దీనిని కోల్పోతే 70.50 వరకు వెళ్లగలదు. అక్కడి నుంచి బౌన్స్‌ అయితే 71.20 స్థాయి వరకు కదులుతుంది’ అని అన్నారు.



You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌: ఐఓసీ 3 శాతం డౌన్‌!

Friday 1st November 2019

ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సెప్టెంబర్‌ త్రైమాసిక పలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 83 శాతం తగ్గి రూ. 564 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 3,247 కోట్లుగా ఉండడం గమనార్హం. ఫలితాలు బాగలేకపోవడంతో కంపెనీ షేరు విలువ శుక్రవారం సెషన్లో ఉదయం 10.14 సమయానికి 3.75 శాతం నష్టపోయి

మందగమన తీవ్రతకు ‘మౌలికం’ అద్దం

Friday 1st November 2019

8 పారిశ్రామిక రంగాల గ్రూప్‌  సెప్టెంబర్‌లో పేలవ పనితీరు వృద్ధిలేకపోగా 5.2 శాతం క్షీణత న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌ సెప్టెంబర్‌ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా - 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్‌ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక  గణాంకాల ప్రకారం... ఎరువుల ఉత్పత్తి తప్ప

Most from this category