మరింత తగ్గిన రూపాయి
By Sakshi

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్ మారకంలో బుధవారం ట్రేడింగ్‌లో 6 పైసలు బలహీనపడి 70.90 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో ప్రారంభ లాభాలను కోల్పోయి, రూపీ డాలర్ మారకంలో 6 పైసలు బలహీనపడి 70.84 వద్ద ముగిసింది. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడడంతో రూపీ స్వల్పనష్టాలతో ముగిసింది. యుఎస్-చైనా పాక్షిక ఒప్పందం అమలు ఆలస్యం కానుందనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం సెషన్లో నిలకడగా ఉన్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్ రిజర్వ్ నిర్ణయం ఈ రోజు సాయంత్రం వెలువడనుండడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించనున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే మార్కెట్ వర్గాలు అంచనావేయడంతో యుఎస్ డాలర్ బలహీనంగా ట్రేడవుతోంది.
You may be interested
బ్రోకరేజ్‌లు టార్గెట్ ధరల్ని పెంచిన షేర్లివే!
Wednesday 30th October 2019స్టాక్మార్కెట్లో ప్రతి ఇన్వెస్టరుకు ఎదురయ్యే ధర్మసందేహం... బాగా పతనమైన షేర్లను కొనాలా? లేక మంచి అప్‌మూవ్ చూపుతూ ఆల్‌టైమ్ హైని చేరిన స్టాకులను కొనాలా? అని.. ఈనేపథ్యంలో షేరు ధరను చూసి కాకుండా వాటి పనితీరును, వాటిపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అభిప్రాయాన్ని అధ్యయనం చేసి పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గత నెల రోజుల్లో కార్పొరేట్ టాక్స్ తగ్గింపుతో కొన్ని స్టాకులు భారీ ర్యాలీలు జరిపాయి. ఇలాంటివాటిలో కొన్ని నాణ్యమైన
గ్యాప్‌అప్‌తో ప్రారంభం
Wednesday 30th October 2019క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన భారత్ స్టాక్ సూచీలు బుధవారం సైతం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 160పాయింట్లు జంప్‌చేసి 40,000 పాయింట్ల సమీపంలో మొదలయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11,845 పాయింట్ల సమీపంలో ప్రారంభమయ్యింది. యస్‌బ్యాంక్, భారతి ఎయిర్టెల్, గ్రాసిమ్, ఐఓసీ, ఇన్ఫోసిస్‌లు 1-2 శాతం లాభంతో మొదలుకాగా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, బీపీసీఎల్‌లు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి.