News


బలహీనపడిన రూపీ

Tuesday 5th November 2019
Markets_main1572926765.png-29356

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 8 పైసలు బలహీనపడి 70.85 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలతో పాటు, విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగడంతో దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకం‍లో గత సెషన్‌ ప్రారంభంలో బలపడింది. కానీ ప్రారంభ లాభాలు కోల్పోవడంతో స్వల్పంగా పెరిగి 70.77 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ కీలక మద్ధతు స్థాయి 97 నుంచి తిరిగి కోలుకుంది. ఫలితంగా బంగారం, వెండి ధరలలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో వీటి ధరలు గత సెషన్లో  స్వల్పంగా తగ్గాయి. తక్షణ బంగారం ఔన్స్‌ 1510 డాలర్ల వద్ద, వెండి ఔన్సు 18.06 డాలర్ల వద్ద ముగిశాయి. రూపీ బలహీన పడడంతో దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలుండడంతో చమురు ధరలు వరుస రెండు రోజులు లాభాల్లో ముగిశాయి. ఇలాంటి పరిస్థితులలో ఒపెక్‌ ఉత్పత్తి కోతను అమలు చేస్తుందా? అనే అనుమానాలు వెలువడడంతో చమురు ధరలు మంగళవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 



You may be interested

ఈ స్టాకుల్లో పెరిగిన ఓపెన్‌ఇంట్రెస్ట్‌

Tuesday 5th November 2019

నవంబర్‌ సీరిస్‌లో సూచీలు కొత్త గరిష్ఠాలను చేరతాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. అయితే ర్యాలీ విస్తృతస్థాయిలో ఉండకపోవచ్చని, కొన్ని స్టాకులకే పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ సీరిస్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిన షేర్లపై ఒక విశ్లేషణ... 1.జిందాల్‌స్టీల్‌ అండ్‌ పవర్‌: నవంబర్‌ సీరిస్‌లో ఓఐ 9.6 శాతం పెరిగింది. ఇదే సమయంలో ధర 18 శాతం పెరిగింది. కంపెనీ గారెపల్మా కోల్‌బ్లాక్‌ను తాజా వేలంలో గెలుచుకోవడంతో ట్రేడర్లు ఈ

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 5th November 2019

టెక్‌ మహీంద్రా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌, ఆర్‌ఈసీ, అజంతా ఫార్మా, అపోలో టైర్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, డాబర్‌ ఇండియా, గుజరాత్‌ గ్యాస్‌, ఎన్‌సీసీ, గతి, జిల్లెట్‌ ఇండియా, జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, వీఎస్‌టీ టిల్లర్స్‌  ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category