News


11 పైసలు బలపడిన రూపీ

Thursday 24th October 2019
Markets_main1571889485.png-29101

దేశీయ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 11 పైసలు బలపడి 70.80 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితిల మధ్య గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో స్పల్పంగా లాభపడి 70.91 వద్ద ముగిసింది. చమురు ధరలు పడిపోతుండడంతో రూపీ బలపడుతున్నప్పటికి, దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో జరుగుతుండడంతో రూపీ లాభాలు పరిమితంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 6.70 వద్ద ప్రారంభమైంది. ఇది గత సెషన్‌లో 6.69 వద్ద ముగిసింది.



You may be interested

హెచ్‌సీఎల్‌ టెక్‌ ర్యాలీ..3.4% అప్‌

Thursday 24th October 2019

ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో  7 శాతం పెరిగి(ఏడాది ప్రాతిపదికన) రూ. 2,711 కోట్లుగా నమోదైంది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 2,534 కోట్లుగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆదాయం కూడా 18 శాతం పెరిగింది. వీటితో పాటు కంపెనీ షేరుపై 1:1 నిష్పత్తిలో బోనస్‌ను ఇవ్వడంతో పాటు, షేరుకు రూ. 2 డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఈ

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Thursday 24th October 2019

నేడు ఈ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు ఫలితాలు వెల్లడించున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ,  పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌(ఇండిగో), ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, ఇక్రా, కాల్గేట్‌ పామోలివ్‌, రేమండ్‌, అలెంబిక్‌ ఫార్మా, కమ్మిన్స్‌ ఇండియా, ఎన్‌ఐఐటీ, రియలన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌, గుజరాత్‌ స్టే్‌ట్‌ ఫెర్టిలైజర్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కాయ, యూనిటెడ్‌ స్పిరిట్స్‌, పరాగ్‌ మిల్క్స్‌, ఇక్రా, రిలయన్స్‌ నావెల్‌

Most from this category