News


26 పైసలు బలపడిన రూపీ

Monday 4th November 2019
Markets_main1572842752.png-29326

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 26 పైసలు బలపడి రూ. 70.55 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 11 పైసలు బలపడి 70.81 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందనే అంచనాలున్నప్పటికి, యురోప్‌, యుఎస్‌ ఆర్థిక డేటా విడుదలవ్వడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా సోమవారం సెషన్లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ ఎన్‌ఎస్‌ఈలో గత సెషన్లో రూ. 70.99 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 8.60 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొం‍ది.



You may be interested

స్థిరంగా పసిడి

Monday 4th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్ప లాభంతో 1,513 వద్ద కదలాడుతుంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరు దేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలను వెలువడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అక్టోబర్‌లో అంచనాలకు మించిన నమోదు కావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు

మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Monday 4th November 2019

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహన అంచనాలతో సోమవారం మార్కెట్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌ ప్రారంభంలో 3శాతానికి పైగా లాభపడింది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలను వెలువడ్డాయి. ఈ సానూకూలాంశంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు

Most from this category