News


68.59 వద్ద రూపీ ప్రారంభం

Friday 5th July 2019
Markets_main1562298984.png-26807

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం ట్రేడింగ్‌లో(జులై 5) ట్రేడింగ్‌లో 0.31 శాతం బలహీన పడి 68.59 వద్ద ప్రారంభమైంది. ఈ రోజు  బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో గత సెషన్‌లో దేశియ మార్కెట్లు సానుకూలంగా ముగియడంతో పాటు చమురు ధరలు పడిపోవడంతో డాలర్‌ మారకంలో రూపీ బలపడింది. ప్రభుత్వం బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచుతుందా?లేదా? అనే అంశంపై మదుపర్లు దృష్ఠి పెట్టనున్నారని మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  68.70 -69.35 మధ్య కదలాడవచ్చని తెలిపారు. 



You may be interested

బడ్జెట్‌ రోజున లాభాల ప్రారంభం

Friday 5th July 2019

ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం భారత్‌ సూచీలు మరో శుభారంభాన్ని చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 39,990 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,962 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 5th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న శుక్రవారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.35 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,997 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,980 పాయింట్ల వద్ద ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11 గంటలకు

Most from this category