News


12 పైసలు బలపడిన రూపీ

Thursday 31st October 2019
Markets_main1572495354.png-29251

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 12 పైసలు బలపడి 70.77 వద్ద ప్రారంభమైంది. కాగా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిష్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో వడ్డీ రేటు  2 శాతం నుంచి 1.5-1.75 శాతం పరిధిలోకి వచ్చింది. 
  యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో చమురు ధరలపై ఫెడ్‌ వడ్డీ రేటు​కోత ప్రభావం కనుమరుగయ్యింది. దీంతో వరుసగా నాల్గవ సెషన్‌లో కూడా క్రూడ్‌ ఆయిల్‌ నష్టాల్లోనే ట్రేడవుతోంది. పండుగ సీజన్‌, ఎఫ్‌ఓఎంసీ(ఫెడ్‌రల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ) పాలసీ వలన ఈ వారం ట్రేడింగ్‌ పేలవంగా సాగిందని, పాలసీ సమావేశానికి ముందు మార్కెట్‌లో ప్రధానమైన బెట్టింగ్‌ జరగలేదని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, కరెన్సీ హెడ్‌ రాహుల్‌ గుప్తా అన్నారు. యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చేంత వరకు రూపీ డాలర్‌ మారకంలో 70.70-71.30 పరిధిలో కదలాడుతుందని అన్నారు. గత సెషన్లో ఎన్‌ఎస్‌ఈలో రూపీ-డాలర్‌ నవంబర్‌ కాంట్రాక్ట్‌ 71.09 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 3.24 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంటకు అధిక స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లు ఉన్నాయని, దీనిని లాంగ్‌పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 31st October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ‍ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  బంధన్‌ బ్యాంక్‌:- విలీన పథకంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ బ్యాంక్‌ 9.89శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీకి 15.93 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసినట్లు బ్యాంకు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. వోడాఫోన్‌ ఐడియా:- 14 బిలియన్‌ డాలర్ల నికర రుణం, పెరుగుతున్న నష్టాలు, క్షీణిస్తున్న చందదారులు లాంటి సమస్యల పరిష్కారానికి రుణదాతులతో సమావేశం జరుపుతునట్లు తెలుస్తోంది.  జీ లిమిటెడ్‌:- సంస్థలలో

మరో గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 31st October 2019

రెండు రోజులుగా భారీ లాభాల్ని ఆర్జించిన భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 40,211 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,895 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరో పావుశాతం తగ్గించడంతో గత రాత్రి అమెరికా ఎస్‌ అండ్‌ పీ-500 సూచి సరికొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది.

Most from this category