News


10 పైసలు నష్టంతో ప్రారంభమైన రూపీ

Monday 23rd September 2019
Markets_main1569211285.png-28480

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 10 పైసలు బలహీనపడి 71.04 వద్ద ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 40 బలపడి 70.94 వద్ద ముగిసింది. దీనితోపాటు దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు గత సెషన్‌లో భారీగా లాభపడడం కూడా రూపీకి కలిసివచ్చింది. కానీ ట్యాక్స్‌ తగ్గిం‍పు బాండ్‌ మార్కెట్‌లో తీవ్రమైన ప్రభావాన్ని చూపకపోవడం గమనార్హం. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో రూపీ-డాలర్‌ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ 71.06 గా ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 6.27 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. అంతేకాకుండా రూపీ-డాలర్‌ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహా ఇచ్చింది.



You may be interested

ఇంధన రంగ సీఈవోలతో మోదీ

Monday 23rd September 2019

హూస్టన్‌: అమెరికాకు చెందిన చమురు, సహజ వాయువు రంగ కంపెనీల సీఈవోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వారితో చర్చించారు. ఇంధన భద్రత, భారత్‌-యూఎస్‌ మధ్య పరస్పర పెట్టుబడి అవకాశాల పెంపుపై మాట్లాడారు. ‘ఎనర్జీ రంగంలోని ప్రముఖ సంస్థల సీఈవోలతో సమావేశం అద్భుతంగా సాగింది. హూస్టన్‌కు వచ్చి ఇంధనం గురించి మాట్లాడకుండా ఉండడం

దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

Monday 23rd September 2019

లభించని ప్రైవేట్‌ పెట్టుబడులు ​బ్రిటిష్‌ ప్రభుత్వ సాయం కోసం చూపు   ప్రభుత్వ సాయం కష్టమేనంటున్న నిపుణులు ల‍ండన్‌: బ్రిటిష్‌ పర్యాటక సంస్థ, థామస్‌ కుక్‌ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది.  ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్‌

Most from this category