News


72 దిగువకు రూపీ

Tuesday 3rd September 2019
Markets_main1567483443.png-28155

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 55 పైసలు బలహీనపడి 71.95 వద్ద ప్రారంభమై..కొద్ది సమయంలోనే 72 దిగువకు జారిపోయింది. దేశియ ఈక్విటీ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో గత సెషన్‌లో(శుక్రవారం) రూపీ డాలర్‌ మారకంలో 38 పైసలు బలపడి 71.40 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సెంజ్‌ వద్ద రూపీ డాలర్‌ మారకంలో 71.76 వద్ద ప్రారంభమై 71.38 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ క్రాష్‌

Tuesday 3rd September 2019

మార్కెట్‌ భారీపతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 27000 స్థాయికి కోల్పోయింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,239.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులకు తోడు, 10 పీఎస్‌యూ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 పెద్ద బ్యాంకుల ఆవిర్భావానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపడంతో బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌,

నిఫ్టీ 100 పాయింట్లు... సెన్సెక్స్‌ 300 పాయింట్లు క్రాష్‌

Tuesday 3rd September 2019

మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టంతో 37,181.76 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల పతనంతో 11000 దిగువున 10,960.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌(క్యూ1)లో దేశ జీడీపీ ఆరేళ్లలోనే కనిష్టానికి పతనమైన 5శాతమే పురోగతి సాధించడటం, పీఎస్‌యూ బ్యాంకులను విలీనం, వస్తు తయారీ రంగం పనితీరు ఆగస్టులో 15నెలల కనిష్టానికి పడిపోవడం, జీఎస్‌టీ వసూళ్లు

Most from this category