News


సరికొత్త కనిష్టానికి రుపీ- ఆపై ప్లస్‌

Friday 13th March 2020
Markets_main1584091941.png-32464

తొలి సెషన్‌లో 74.50కు
2018 అక్టోబర్‌ రికార్డ్‌కు చెక్‌
తదుపరి 74 దిగువకు రికవరీ

దేశీ స్టాక్‌ మార్కెట్లతోపాటు తొలి సెషన్‌లో కరెన్సీకి సైతం షాక్‌ తగిలింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 18 పైసలు క్షీణించి 74.39 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఫారెక్స్‌ మార్కెట్లో తొలిసారి దేశీ కరెన్సీ విలువ 74.50కు జారింది. వెరసి ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో నమోదైన చరిత్రాత్మక కనిష్టం 74.48 రికార్డును సవరించింది. ఆపై ఈక్విటీ మార్కెట్ల బాటలో బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. రికవరీ బాటలో సాగుతూ మధ్యాహ్నానికల్లా లాభాల్లోకి ప్రవేశించింది. 2.20 ప్రాంతంలో 29 పైసలు(4 శాతం) బలపడి 73.96కు చేరింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 74 లోపున కదులుతోంది. స్వాప్‌ కార్యకలాపాలలో భాగంగా 200 కోట్ల డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించడం ద్వారా రిజర్వ్‌ బ్యాంక్‌ రూపాయికి అండగా నిలిచినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

ఒడిదొడుకులు
ఇటీవల నేలచూపులతో కదులుతున్న రూపాయి గురువారం 53 పైసలు కోల్పోయి 74.21 వద్ద ముగిసింది. ఇది 17 నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో మాత్రమే రూపాయి ఈ స్థాయిలో ట్రేడయ్యింది. కోవిడ్‌-19ను ప్రపంచ మహమ్మారి వ్యాధిగా గుర్తించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడం, యూరోపియన్‌ దేశాల నుంచి అమెరికాకు ప్రయాణాలను నిషేధించడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. బుధవారం రూపాయి ఏకంగా 53 పైసలు జంప్‌చేసింది. 73.64 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్లో యెన్‌ తదితర కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం, దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు జోరందుకోవడం, రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్ల కొనుగోళ్లు వంటి అంశాలు రూపాయికి బలాన్నిచ్చినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఎఫ్‌పీఐల ఎఫెక్ట్‌
కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. దేశీ కేపిటల్‌ మార్కెట్ల(ఈక్విటీలు, డెట్‌)లో నికరంగా ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 33,163 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇటీవలి కాలంలో రూపాయి బలహీనపడుతూ వచ్చినట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. కరోనా ధాటికి ఆర్థిక వ్యవస్థలు బలహీనపడకుండా చూసే బాటలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ ఏడాదికి 120 బిలియన్‌ యూరోల ప్యాకేజీని ప్రకటించగా.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 1.5 ట్రిలియన్‌ డాలర్ల స్వల్పకాలిక రుణాలను ఆఫర్‌ చేస్తోంది. ఇలాంటి పలు అంశాలు కరెన్సీ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి.You may be interested

యస్‌బ్యాంక్‌ వాటా విక్రయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం ..!

Friday 13th March 2020

సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ వాటా కొనుగోలును కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి.  ఆర్‌బీఐ రూపొందించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ముసాయిదా ప్రకారం వ్యూహాత్మక ఇన్వెస్టర్లు బ్యాంకులో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల లోపు దీన్ని 26 శాతానికి లోపు తగ్గించుకోవడానికి ఉండదు. ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆర్‌బీఐ యస్ బ్యాంకుపై

ఎయిర్‌ ఇండియా విక్రయానికి గడువు పొడిగింపు

Friday 13th March 2020

ఎయిర్‌ ఇండియా విక్రయాన్ని ప్రభుత్వం మరో నెలరోజులు పాటు పొడిగించింది. ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్స్‌ను ఏప్రిల్‌ 30 వరకు స్వీకరించనున్నట్లు హోమంత్రి అమిత్‌ షా తో కూడిన మంత్రిత్వ ప్యానల్‌ తెలిపింది. కోవిడ్‌-19తో పరిస్థితులు అనుకూలంగా లేనందున బిడ్స్‌ సమర్పణకు గడువు పొడిగించాలని ఆసక్తిగల కొనుగోలు దారులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యానెల్‌ వెల్లడించింది. కాగా జనవరిలో ఎయిర్‌ ఇండియాలో 100 శాతం

Most from this category