News


మరింత పెరిగిన రూపాయి..

Friday 10th January 2020
Markets_main1578649140.png-30835

12 పైసలు ప్లస్‌

71.09 వద్ద ట్రేడింగ్‌

డాలరుతో మారకంలో బుధవారం లాభాల యూటర్న్‌ తీసుకున్న దేశీ కరెన్సీ వరుసగా మూడో రోజు శుక్రవారం సైతం బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి మధ్యాహ్నానికల్లా 12 పైసలు(0.17 శాతం) పుంజుకుని  71.09 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు చల్లబడటంతో ఇటీవల ముడిచమురు, బంగారం ధరలు నీరసించగా.. స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 49 పైసలు ఎగసింది. 71.21 వద్ద ముగిసింది. ఇక బుధవారం పతనం నుంచి కోలుకున్న రూపాయి 12 పైసలు బలపడటం​ద్వారా 71.70 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడుతున్న సంకేతాలతో చమురు, బంగారం ధరలు క్షీణించగా.. రూపాయి బలపడుతూ వస్తోంది. బుధవారం ఉదయం ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడంతో తొలుత యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో చమురు ధరలు 5 శాతం, పసిడి ధర 2.5 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఫలితంగా రూపాయి తొలుత 20 పైసలు పతనమై 72.05ను తాకిన విషయం విదితమే.



You may be interested

రుణభారం లేని కంపెనీల షేర్లను ఎన్నుకొండి..!

Friday 10th January 2020

అప్పు నిప్పు లాంటిందని భారతీయ సమాజం భావిస్తుంది. ఈ సెంటిమెంట్‌ ప్రభావం రుణభారంతో సతమతమవుతున్న కంపెనీలపై పడింది. గతేడాదిలో అధిక అప్పులతో కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. వాస్తవానికి రుణరహితంగా ఉన్న మెజారిటీ కంపెనీల షేర్లు 2019లో 122శాతం పెరిగాయి. రుణరహిత కంపెనీల్లో అగ్రశ్రేణిలో ఉన్న టాప్‌-15 కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు 50శాతం లాభాల్ని పంచాయి.  రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆస్ట్రాజెనికా

పీఎస్‌బీల్లో వాటాలు తగ్గించుకుంటున్న ఎంఎఫ్‌లు

Friday 10th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌కు పీఎస్‌యూ బ్యాంకుల్లో ఉన్న వాటాలు అనేక సంవత్సరాల కనిష్ఠాలకు చేరాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి దీంతో పాటు యస్‌బ్యాంకులో కూడా ఎంఎఫ్‌లు గణనీయంగా వాటాలు తగ్గించుకుంటున్నాయి. పీఎస్‌బీల్లో వాటాలు తగ్గించుకుంటున్న ఫండ్స్‌ ఇదే సమయంలో స్టాఫింగ్‌ సంస్థలు, సిమెంట్‌ ఉత్పత్తి కంపెనీల్లో వాటాలు పెంచుకుంటున్నాయి. యస్‌బ్యాంకులో డిసెంబర్‌ త్రైమాసికంలో ఎంఎఫ్‌లు తమ వాటాను 5.1 శాతానికి తగ్గించుకున్నాయి. 2013 తర్వాత బ్యాంకులో ఎంఎఫ్‌ల వాటా ఈ స్థాయికి రావడం

Most from this category