News


రూపాయికీ 38 పైసలు బూస్ట్‌

Saturday 21st September 2019
Markets_main1569041936.png-28464

  • 70.94 వద్ద ముగింపు

కార్పొరేట్‌ పన్నులను తగ్గిస్తూ, ప్రభుత్వం చేసిన ప్రకటన రూపాయికీ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40పైసలు లాభపడి, 70.94 వద్ద ముగిసింది. గురువారం రూపాయి ముగింపు 71.34. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 71.19 వద్ద ప్రారంభమైంది. అయితే వారంవారీగా చూస్తే, 2పైసలు నష్టంలోనే రూపాయి ఉంది. కాగా రూపాయి 68కిపైగా బలపడ్డం కష్టమేనన్న విశ్లేషణలూ ఉన్నాయి. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు క్రూడ్‌ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాల వంటి అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. ఇటీవలి వరకూ కొనసాగుతున్న ఈక్విటీ మార్కెట్ల పతనం, విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతుండడం వంటి అంశాలు రూపాయిని తిరిగి బలహీన స్థితికి నెట్టాయి. చమురు ధర పెరుగుదల భయాల నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. 



You may be interested

సున్నిత అంశాల డేటా భారత్‌లోనే ఉండాలి: రవిశంకర్ ప్రసాద్

Saturday 21st September 2019

న్యూఢిల్లీ: దేశ డేటా సార్వభౌమాధికారం చేజారి పోనిచ్చేది లేదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఉద్ఘాటించారు. సున్నిత, అతి సున్నిత అంశాలకు సంబంధించిన సమాచారం దేశంలోనే ఉండాలని వ్యాఖ్యానించారు. డేటా లభ్యత, వినియోగం, ఆవిష్కరణ.. డేటా గోప్యతల మధ్య సమతుల్యత అవసరమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ఆవిర్భావం, ప్రభావం అనే అంశంపై జైపురియా స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన సమావేశానికి

రిటైల్‌ మార్కెట్లోకి కేపీఆర్‌ గ్రూప్‌

Saturday 21st September 2019

ఆర్గానిక్‌ ఇన్నర్‌వేర్‌ ‘ఫాసో’ విడుదల రూ.3,450 కోట్ల టర్నోవర్‌ అంచనా కొత్త ప్లాంటు తెలుగు రాష్ట్రాల్లో..? హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వివిధ రంగాల్లో ఉన్న తమిళనాడుకు చెందిన కేపీఆర్‌ గ్రూప్‌ కంపెనీ కేపీఆర్‌ మిల్‌.. ఫాసో పేరుతో సొంత బ్రాండ్‌లో లోదుస్తుల విభాగంలోకి ప్రవేశించింది. భారత్‌లో తొలిసారిగా నూరు శాతం ఆర్గానిక్‌ కాటన్‌తో వీటిని తయారు చేశారు. ఇటీవలే తమిళనాడు, కేరళలో ఫాసో ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందుబాటులోకి

Most from this category