News


బలపడ్డ రూపాయి

Thursday 9th January 2020
Markets_main1578543769.png-30791

ప్రారంభంలోనే 27 పైసలు అప్‌
బుధవారం 12 పైసలు ప్లస్‌

డాలరుతో మారకంలో ఇటీవల బలహీనపడుతూ వచ్చిన దేశీ కరెన్సీ వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇరాన్‌, అమెరికా మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు చల్లబడనున్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్‌నిచ్చాయి. దీంతో చమురు, బంగారం ధరలు చల్లబడగా రూపాయి బలపడుతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి గురువారం ట్రేడింగ్‌లో 27 పైసలు ఎగసింది. 71.43 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.45 ప్రాంతంలో 23 పైసలు(0.3 శాతం) లాభపడి 71.47 వద్ద ట్రేడవుతోంది. 

కారణాలిలా..
ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై బుధవారం ఇరాన్‌ చేసిన క్షిపణి దాడుల్లో ప్రాణ నష్టం సంభవించలేదంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో కొంతమేర సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు వైపులా ఇకపై పరస్పర దాడులకు దిగబోమన్న సంకేతాలు వెలువడటంతో చమురు, బంగారం ధరలు దిగివచ్చినట్లు తెలియజేశారు. ఇది పరోక్షంగా రూపాయికి జోష్‌నిస్తున్నట్లు వివరించారు. కాగా.. బుధవారం ఉదయం ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడంతో తొలుత యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో చమురు ధరలు 5 శాతం, పసిడి ధర 2.5 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఫలితంగా రూపాయి తొలుత 20 పైసలు పతనమై 72.05ను తాకిన సంగతి తెలిసిందే. చివరికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడుతున్న సంకేతాల కారణంగా కోలుకుంది. అంతేకాకుండా మంగళవారం ముగింపు 71.82తో పోలిస్తే 12 పైసలు పుంజుకుని 71.70 వద్ద ముగిసింది.



You may be interested

తెలంగాణలో సుగ్న మెటల్స్‌ రెండో ప్లాంట్‌ ఏర్పాటు

Thursday 9th January 2020

మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉక్కు తయారీ కంపెనీ సుగ్న మెటల్స్‌ తెలంగాణ వికారాబాద్‌లోని పరిగిలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో సుగ్న 2008లో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టర్బో టీఎంటీ రాడ్లతో పాటూ ఉక్కు తయారీలో వినియోగించే బిల్లెట్లు, స్పాంజ్‌ ఐరన్‌ వంటివి కూడా ఈ ప్లాంట్‌లో

ఎయిర్‌టెల్‌ 200 కోట్ల డాలర్ల క్యూఐపీ మొదలు

Thursday 9th January 2020

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌ క్యాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) ఇష్యూ మొదలైంది. ఈ ఇష్యూకు ఫ్లోర్‌ ధరగా రూ.452.09ను నిర్ణయించామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.14,200 కోట్లు) సమీకరిస్తామని పేర్కొంది. అంతే కాకుండా ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌(ఎఫ్‌సీసీబీ)ల ‍ద్వారా మరో వంద కోట్ల డాలర్లు(రూ.7,100 కోట్లు) సమీకరిస్తామని తెలిపింది. క్యూఐపీ, ఎఫ్‌సీసీబీల ద్వారా సమీకరించిన నిధులను నెట్‌వర్క్‌ విస్తరణకు,

Most from this category