News


రూపీ బలహీనం

Wednesday 17th July 2019
Markets_main1563338785.png-27114

రూపీ డాలర్‌ మారకంలో 7 పైసలు బలహీనపడి 68.77 వద్ద బుధవారం ట్రేడవుతోంది. ఇది 68.70 వద్ద ప్రారంభమైంది. విదేశి పెట్టుబడులు బయటకు వెళ్లడం, ఆయిల్‌ ధరలు పెరగడం, మేజర్‌ కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌మారకంలో 69.76 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. దేశియ మార్కెట్లో కొనుగోలు పెరగడంతో రూపీ కొలుకొని చివరకు 17 పైసలు బలహీన పడి 68.71 వద్ద ముగిసింది.
    ట్రేడ్‌వార్‌ వలన ఇండియా ఎగుమతులు జూన్‌ నెలలో 9 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. దీంతోపాటు బాండ్‌ ఈల్డ్‌లు వరుసగా ఐదవ రోజు కూడా పడిపోయాయి. ఫలితంగా ఆర్బిఐ తదుపరి రేట్ల కోతపై భయాలు పెరిగాయి. ఎక్సేంజ్‌ డేటా ప్రకారం రూ.216.44 కోట్ల విదేశి సంస్థాగత పెట్టుబడులు దేశియ మార్కెట్లను దాటి పోయాయి. అంతేకాకుండా గత సెషన్‌లో చమురు ధరలు 0.3 శాతం పెరగడం కూడా రూపీ బలహీనతకు కారణం. రూపాయి/డాలర్‌ రిఫరెన్స్ రేటును 68.5836 గా, రూపాయి /యూరో 77.3074 గా , రూపాయి /బ్రిటిష్ పౌండ్ల 86.1991 గా, రూపాయి /100 జపనీస్ యెన్‌ 63.49 గా ఫైనాన్షియల్ బెంచ్మార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌బిఐఎల్) నిర్ణయించింది. 

 



You may be interested

విప్రోకు ఉజ్వల భవిష్యత్..

Wednesday 17th July 2019

కొత్త శిఖరాలు అధిగమిస్తుంది డిజిటల్, క్లౌడ్‌పై భారీ పెట్టుబడులు చైర్మన్‌గా చివరి ఏజీఎంలో అజీం ప్రేమ్‌జీ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజినీరింగ్‌ సేవలు, సైబర్‌ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు.

డాలర్‌ ఎఫెక్ట్‌: తగ్గుముఖం పట్టిన పసిడి

Wednesday 17th July 2019

డాలర్‌ రికవరితో పసిడి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు ఔన్స్‌ పసిడి ధర 5 డాలర్లు నష్టపోయి 1,406డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిన్నరాత్రి జూన్‌ మాసపు రిటైల్‌ అమ్మకాల గణాంకాలు విడుదల చేసింది. జూన్‌లో రిటైల్‌ అమ్మకాల గణాంకాలు 0.1శాతంగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా, అంచనాలకు మించి 0.4శాతంగా నమోదయ్యాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో

Most from this category