News


రెండవరోజూ రూపాయికి 15 పైసలు లాభం

Thursday 28th November 2019
Markets_main1574913223.png-29915

  • 71.35 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 15 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 71.35 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల గరిష్టస్థాయి.  మంగళవారం ముగింపు 71.50. దేశీయ ఈక్విటీలకు లాభాలు, కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ప్రవాహం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇదే కారణాలతో మంగళవారం కూడా రూపాయి బలపడింది. ట్రేడింగ్‌ మొదట్లో 71.43 వద్ద పటిష్టంగా రూపాయి ప్రారంభమైంది. ఒక దశలో 71.30  గరిష్టాన్నీ చూసింది. మొత్తంగా 71.30-71.48 శ్రేణిలో తిరిగింది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో  రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.



You may be interested

ప్రారంభంలో సరికొత్త రికార్డు

Thursday 28th November 2019

నవంబర్‌ డెరివేటివ్‌ సీరిస్‌ కాంట్రాక్టుల ముగింపునకు చివరిరోజైన గురువారం స్టాక్‌ సూచీలు సరికొత్త రికార్డుస్థాయి వద్ద మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 41,161 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 12,133 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

ఐపీవో మార్కెట్లో మళ్లీ సందడి!

Thursday 28th November 2019

ఒకదాని వెంట ఒకటి ఇష్యూకు గత రెండు నెలల్లో ఇష్యూలకు మంచి ఆదరణ కొత్తగా ఐపీవో కోసం కంపెనీల దరఖాస్తులు మద్దతుగా నిలుస్తున్న మార్కెట్ల ర్యాలీ  న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్‌)తో ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు ఎంతో అనిశ్చితులను చవిచూశాయి. ఫలితంగా మొదటి పది నెలల కాలంలో వచ్చిన పేరున్న ఐపీవో ఇష్యూలు 20లోపునకే పరిమితమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా

Most from this category