News


రూపాయి... కొనసాగుతున్న ‘చరిత్రాత్మక’ పతనం

Saturday 21st March 2020
Markets_main1584763060.png-32604

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజు శుక్రవారం మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి  కిందకుపడిపోయింది. గురువారం ముగింపుతో పోల్చితే 8 పైసలు బలహీనపడి 75.20కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు.  ఇంట్రాడేలో రూపాయి విలువ గురువారం తరహాలోనే 75.30ని తాకింది. రూపాయి క్రితం ముగింపు 75.12. 

ఆరు నెలల కనిష్టానికి విదేశీ మారకపు నిల్వలు...
​కాగా దేశీయ విదేశీ మారకపు నిల్వలు మార్చి 13తో ముగిసిన వారంలో 6 నెలల కనిష్ట స్థాయి 481.89 డాలర్లకు పడిపోయాయి. వారంవారీగా 5.35 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. మార్చి 6తో ముగిసిన వారంలో దేశీయ విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో 487.23 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 



You may be interested

ఏప్రిల్‌ 2 వరకూ రాణా కపూర్‌ కస్టడీ పొడిగింపు

Saturday 21st March 2020

 యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ జ్యుడీషియల్‌ కస్టడీని  ఏప్రిల్‌ 2 వరకూ కోర్టు పొడిగించింది. వివరాల్లోకి వెళితే, అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టయిన 62 సంవత్సరాల కపూర్‌ జ్యుడీషియల్‌ కస్టడీ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇక్కడి కోర్టు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హాజరుపరిచింది. రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోరలేదు. అయితే మరో కేసులో కపూర్‌పై ఉన్న వారెంట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది.

షార్ట్‌  సెల్లింగ్....ఒకింత కఠినం  !

Saturday 21st March 2020

ఒడిదుడుకులు తగ్గించేందుకే సెబీ తాజా నిర్ణయాలు  స్టాక్‌ మార్కెట్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులను నివారించేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నడుం బిగించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జరిపే షార్ట్‌ సెల్లింగ్‌పై పరిమితులను విధించడం ద్వారా ఒడిదుడుకులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.  డెరివేటివ్స్‌ సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్‌ వైడ్‌ పొజిషన్ల పరిమితిని సవరించింది. డైనమిక్‌ ప్రైస్‌బాండ్లలో సరళీకరణతో సహా మరికొన్ని మార్పులు, చేర్పులు చేసింది. సోమవారం (ఈ

Most from this category