News


రూపాయి... ఒకేరోజు 62 పైసలు పతనం!

Thursday 14th November 2019
Markets_main1573702139.png-29568

  • రెండు నెలల కనిష్టం...
  • 72.09కి డౌన్‌

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం 62 పైసలు పతనం అయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్‌లో 72.09 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో (సెప్టెంబర్‌ 4 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం వంటి కీలక ఆర్థిక గణాంకాల నిరుత్సాహం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలపై అనుమానాలు వంటి అంశాలు రూపాయి మారకంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రూపాయి ట్రేడింగ్‌ బలహీనంగా 71.75 వద్ద ప్రారంభమైంది. సమయం గడుస్తున్న కొలదీ 72వైపు సాగి ఒక దశలో 72.10ని కూడా చూసింది. రూపాయి వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ నష్టాలను కొనసాగిస్తోంది. రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో (62 పైసలు) పతనం కావడం కూడా సెప్టెంబర్‌ 16 తరువాత ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో పటిష్ట డాలర్‌ కూడా రూపాయి దిగువ ప్రయాణానికి కారణం అవుతోంది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో  రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.  చమురు ధర పెరుగుదల భయాలు  కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. 



You may be interested

కాఫీ డే లాభాలు క్యూ1లో రూ.1,567 కోట్లు

Thursday 14th November 2019

గత క్యూ1లో రూ.21 కోట్లు మాత్రమే కలసివచ్చిన ‘మైండ్‌ ట్రీ’ వాటా విక్రయం న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూన్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌) రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,567 కోట్లకు పెరిగిందని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయం కారణంగా వచ్చిన

ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు..!

Thursday 14th November 2019

బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) తాజా సిఫార్సులు న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ & సీఈఓ) బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్ వీ ప్రభాకర్, అటను కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన

Most from this category