News


5 శాతం పెరిగిన రుచీ సోయా

Monday 27th January 2020
Markets_main1580122244.png-31244


లిస్టింగ్‌లో 5 శాతం పెరిగిన రుచీ సోయా
పతంజలి గ్రూపుకు చెందిన రుచీ సోయా ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం తిరిగి ట్రేడ్‌ అయ్యాయి. బీఎస్‌ఈలో 5 శాతం పెరిగి రూ.16.90 వద్ద లాక్‌ అయ్యాయి. 2017లో ఎన్‌సీఎల్‌టీ ప్రతిపాదనల మేరకు 2019 సెప్టెంబర్‌లో హరిద్వార్‌ కేంద్రంగా పనిచేస్తోన్న పతంజలి గ్రూపు చెందిన పతంజలి ఆయుర్వేద రూ.4,500 కోట్లకు రుచీ సోయాను సొంతం చేసుకుంది. 2017లో రుచీ సోయా కంపెనీ చార్టెడ్‌​ బ్యాంక్‌, డీబీఎస్‌ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రుచీ సోయా రూ.25000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మరికొన్నేళ్లలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా ఎదుగుతామని యోగ గురు రామ్‌ దేవ్‌ తాజాగా వెల్లడించారు. మొత్తం టర్నోవర్‌లో 12 వేల కోట్లను పతంజలి గ్రూపు, 13 వేల కోట్లను రుచీ కంపెనీతో రిజిస్టర్‌ చేయనున్నట్లు రామ్‌దేవ్‌ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో కంపెనీ టర్నోవర్‌ను రూ.50 వేల కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్లకు వృద్ధి చేస్తామని రామ్‌దేవ్‌ వివరించారు. గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్‌, బీపీ వంటి అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని త్వరలో న్యూట్రెలా నుంచి మూడు కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నామని, తద్వారా దేశంలో 50 కోట్ల కస్టమర్లకు దగ్గర అవుతామని తెలిపారు. రుచీ సోయా బ్రాండ్స్‌లో న్యూట్రెలా గోల్డ్‌ ఆయిల్‌, న్యూట్రెలా హనీ, న్యూట్రెలా ప్రోటిన్‌ ఆటాను కొత్తగా ప్రవేశపెట్టనుంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా రానున్న  రెండేళ్లలో  రుచీ సోయా  25 శాతం వాటాను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. కాగా రుచీ కంపెనీకి న్యుట్రెలా, మహాకోష్‌, సన్‌రిచ్‌, రుచీస్టార్‌, రుచీ గోల్డ్‌ పేరుతో  బ్రాండ్లు ఉన్నాయి. 



You may be interested

ఎయిరిండియా విక్రయం.. టేకాఫ్‌

Tuesday 28th January 2020

(అప్‌డేటెడ్‌...) 100 శాతం వాటా అమ్మకానికి సై... బిడ్డింగ్‌ పత్రాన్ని విడుదలచేసిన కేంద్రం ఆసక్తి వ్యక్తీకరణకు మార్చి 17 డెడ్‌లైన్‌... రూ.23,287 కోట్ల అప్పు భరించాల్సిందే.. బిడ్డింగ్‌ నిబంధనల్లోనూ పలు మార్పులు న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి... ఎగరడానికి ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను పూర్తిగా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను సోమవారం విడుదల చేసింది.

చైనాకు జలుబు- ప్రపంచ మార్కెట్లకు వణుకు

Monday 27th January 2020

సెన్సెక్స్‌ 458 పాయింట్లు పతనం 129 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 2 శాతం పతనమైన యూరప్‌ మార్కెట్లు ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం ఎదురీత అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచ మార్కెట్లకు తుమ్ములొస్తాయన్నది స్టాక్‌ మార్కెట్లలో పాత సామెత. అయితే ప్రస్తుతం చైనాలోని మారుమూల వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. వెరసి దేశీయంగానూ ఆందోళనకులోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా మార్కెట్లు రోజంతా నష్టాలమధ్యే కదిలాయి. సెన్సెక్స్‌ 458 పాయింట్లు

Most from this category