News


5నిమిషాల్లో రూ.5లక్షల కోట్లు ఆవిరి..!

Friday 28th February 2020
Markets_main1582867610.png-32159

మార్కెట్లో నెలకొన్న అమ్మకాల సునామీతో శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన కేవలం 5నిమిషాల్లోనే ఏకంగా రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.150లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. కరోనా వైరస్‌ భయాలతో వరుసగా ఆరో రోజూ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ 6రోజుల్లో బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ దాదాపు రూ.10లక్షల కోట్లు హరించుకుపోయింది.

కరోనా వైరస్ అంటువ్యాధి పశ్చిమదేశాలకు చేరుకోవడంతో దలాల్ స్ట్రీట్లో  షేర్ల పతనం ఆగడం​ లేదు. కరోనా వైరస్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి ధనిక దేశాలతో సహా అన్ని దేశాలు సిద్ధమవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ గురువారం ప్రకటించడంతో ప్రపంచఈక్విటీ మార్కెట్లో అమ్మకాల సునామీ సాగుతోంది. నిన్నరాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 4శాతం పైనా పతనమవగా, నేడు ఆసియాలో ప్రధాన సూచీలు 3శాతం నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ సూచీలు నేడు భారీ నష్టంతో ట్రేడింగ్‌ ప్రారభించాయి. ప్రధాన  ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికపు జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందా లేదా అంశంపై మార్కెట్‌ ఓ అంచనాకు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

భారీగా పెరిగి కరోనా వైరస్‌ వ్యాధి భాధితుల సంఖ్య:
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ వ్యాధి వేగంగా ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. అంతర్జాతీయంగా శుక్రవారం నాటికి మొత్తం 83వేల మంది ఈ వైరస్‌ భారిన పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఆవిర్భావానికి కారణమని చెబుతున్న చైనాలో ఇప్పటి వరకు 2,788 మరణాలు సంభవించగా, మొత్తం 78,824 కేసులు నమోదైనట్లు గుణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా ఉంది. కేవలం శుక్రవారం మాత్రమే 256 మంది కొత్త కరోనా వైరస్‌ భాధితులు నమోదయ్యాయి. మొత్తంగా చైనా బయటి దేశాల్లో 2వేల మంది ఈ వ్యాధి భారీన పడ్డారు. You may be interested

3శాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ

Friday 28th February 2020

కరోనా వ్యాధి భయాలతో మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు ఉదయం సెషన్‌లో ఏకంగా 919 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్‌ భారీ గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభంలో భాగంగా నేడు ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(30,187.00)తో పోలిస్తే 685 పాయింట్ల నష్టంతో 30,000  దిగువన 29,501.55 వద్ద మొదలైంది.

నేటి వార్తల్లోని షేర్లు

Friday 28th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు టాటా పవర్‌: సుంకాలు పెంచకపోతే గుజరాత్‌, హర్యాణ, పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల డిస్కంలకు  మార్చి నుంచి పవర్‌ సరపరాను నిలిపివేస్తామని టాటా పవర్‌ వెల్లడించింది. హెచ్‌యూఎల్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆశించినస్థాయిల్లో కొనుగోళ్లు లేకపోవడం వల్ల వ్యాపార వృద్ధి సాఫ్ట్‌గా సాగుతుందని యూనిలీవర్‌ కంపెనీ వెల్లడించింది. యూనీలీవర్‌ మొత్తం విక్రయాల్లో ఇండియాలో జరిగేవి 9 శాతంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఎన్‌బీసీసీ: దక్షిణ ఢిల్లీలోని నౌరోజి

Most from this category