News


ట్రంప్‌ దెబ్బకు రూ. 3 లక్షల కోట్లు హుష్‌కాకి!

Monday 6th January 2020
Markets_main1578304869.png-30707

సోమవారం మార్కెట్లు బేర్‌ గుప్పిట్లో విలవిల్లాడాయి. ఒక్కరోజులోనే రూ. 3 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇరాన్‌ మిలటరీ లీడర్‌పై అమెరికా దాడితో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలపై పడింది. మరోవైపు తమ బలగాలు వైదొలగాలని కోరితే ఇరాక్‌పై మునుపెన్నడూలేనంత ఆంక్షలు వేస్తానని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో దేశీయ మార్కెట్లు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 సమయానికి బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 154 లక్షల కోట్లకు చేరింది. గత శుక్రవారం ఈ విలువ రూ. 157 లక్షల కోట్లు. సోమవారం ట్రేడింగ్‌లో ‍ప్రతి ఐదింటిలో నాలుగు స్టాకులు నెగిటవ్‌గా ట్రేడవుతున్నాయి. లార్జ్‌క్యాప్స్‌ కన్నా స్మాల్‌క్యాప్స్‌ తీవ్ర నష్టాలు చూస్తున్నాయి. ఇరాన్‌ ఉద్రిక్తతలతో బ్రెంట్‌క్రూడ్‌ 70 డాలర్లను చేరడం దేశీయ ఈక్విటీల్లో ఆందోళనకు ప్రధాన కారణమైంది. ఇరాన్‌ స్పందన తీవ్రంగా ఉంటే ప్రపంచ క్రూడ్‌ సరఫరాలో 20 శాతం మేర దెబ్బతింటుందని, దీంతో క్రూడాయిల్‌ ధర 20 శాతం మేర పెరగవచ్చని అంతర్జాతీయ నిపుణుడు జొనాథన్‌ బారాత్‌ చెప్పారు. టెన్షన్లు కొనసాగితే ముందుగా క్రూడ్‌ 75 డాలర్లను చేరవచ్చన్నారు. ప్రపంచ ఎకానమీలు ఇంత ధరను సహించే స్థితికి ఇంకా రాలేదన్నారు. క్రూడాయిల్‌ ధర 75 డాలర్లను కూడా దాటిపోతే ఇండియాకు ఇక్కట్లు పెరుగుతాయని దేశీయ ఎకనమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రూడ్‌ ధర పెరగడం క్రమంగా విత్తలోటును పెంచుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. దీంతో దాదాపు అన్ని రంగాల షేర్లు సోమవారం నష్టాల్లోకి జారాయి. అత్యధికంగా బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంత, జీ, ఎస్‌బీఐ షేర్లు భారీగా నష్టపోగా, విప్రో, టైటాన్‌ తదితరాలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. చమురు వినియోగం ఉండే రంగాల షేర్లు రాబోయే కాలంలో మరింత డౌన్‌ట్రెండ్‌ చూడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న స్టాకులు మరింతగా పతనమయ్యే ప్రమాదం ఉందన్నారు. You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు

Monday 6th January 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లు భారీగా నష్టాలను చవిచూసాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2,512 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని వార్తలతో పాటు నేడు మార్కెట్లో వెల్లువెత్తిన భారీ అమ్మకాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఫలితంగా ఇండెక్స్‌లో ఒకదశలో

బేర్‌ షాక్‌- ఇన్వెస్టర్ల కింకర్తవ్యం?

Monday 6th January 2020

టెన్షన్ల షాక్‌- ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఉన్నట్టుండి అమెరికా, ఇరాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు షాక్‌నిచ్చాయి. కొత్త ఏడాది(2020)లో సరికొత్త రికార్డులను సాధించే హుషారుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లను గత వారం అనుకోకుండా చెలరేగిన మధ్యప్రాచ్య వివాదాలు దెబ్బతీస్తున్నాయి. దీంతో శుక్రవారమే మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని చవిచూడగా.. తాజాగా నేడు(సోమవారం) పతన పరిస్థితులలో చిక్కుకున్నాయి. ఈ దశలో ఇన్వెస్టర్లు నిరాశకు లోనైనప్పటికీ ఇలాంటి అంశాలను అవకాశాలుగా

Most from this category