News


మార్కెట్‌ ర్యాలీకి కారణలివే..!

Monday 2nd March 2020
Markets_main1583139969.png-32221

  • కేంద్ర బ్యాంకుల నుంచి వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు 
  • కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌
  • ఇంట్రాడేలో 785పాయంట్లు పెరిగిన సెన్సెక్స్‌
  • 231 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 

వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్‌ భారీ పతనం తర్వాత భారత స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాల్ని నమోదు చేసింది. ప్రధాన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు ఏకంగా 2శాతం లాభాల్ని ఆర్జించాయి. మందగించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలుదేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడటం, వడ్డీరేట్లను తగ్గించడం లాంటి ఆర్థిక చర్యలకు పూనుకోవచ్చనే అంచనాలతో నేడు ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అలాగే ఆరురోజుల పతనంలో భాగంగా షేర్లు చౌక ధరల్లో లభిస్తుండంతో నెలకొన్న షార్ట్‌ కవరింగ్‌ సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా సెన్సెక్స్‌ 785పాయంట్లు పెరిగి 39,083.17 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 231పాయింట్లు లాభపడి 11,433.00 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. 

60సెకన్లలో  రూ.2.07లక్షల కోట్లు:
సూచీలు లాభాల భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించడంతో కేవలం 60 సెకన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.2.07 లక్షల కోట్లను ఆర్జించగలిగారు. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో మొత్తం లిస్టైన మొత్తం కంపెనీ మార్కెట్‌ క్యాప్ 1.48లక్షల కోట్లకు చేరుకుంది. గతవారం ట్రేడింగ్‌ చివరివారమైన శుక్రవారం సూచీలు భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.5లక్షల కోట్లు ఆవిరైన సంగతి తెలిసిందే.

సూచీలు ర్యాలీకి కారణాలివే..!
ఉద్దీపనలపై ఆశలు పెంచిన ఫెడ్‌ రిజర్వ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ :
అమెరికా ఆర్థిక వ్యవస్థకు చక్కదిద్దేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంటుందని ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్ పావెల్ శుక్రవారం అన్నారు. ఫెడ్‌ ఈ దఫా వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలను పావెల్‌ వాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయని రాయిలర్స్‌ పేర్కోంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ హరుహికో కురోడా మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలను బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ జాగ్రత్తగా పర్యవేక్షిస్తుందని, మార్కెట్లను స్థిరీకరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది తెలిపారు. మార్కెట్‌ ఆపరేషన్స్‌, ఆస్తుల కొనుగోళ్ల ద్వారా వ్యవస్థలో తగినంత ద్రవ్యతను అందిస్తుందని చెప్పారు

చైనాలో రేటు తగ్గింపు ఆశలు:
చైనాలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు ఆ దేశ రేటు తగ్గింపుపై ఆశలను పెంచింది. జవవరి నెలలో పీఎంఐ గణాంకాలు 16ఏళ్ల కనిష్టానికి పతనమైన 40.3శాతంగా నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న క్షీణత, బలహీన గణాంకాల నమోదు నేపథ్యంలో ఈసారి ఎన్‌పీసీ సమావేశంలో రేటును తగ్గింపులతో మరిన్ని ఆర్థిక ఉద్దీపన చర్యల ప్రకటనలుండచ్చని మారె‍్కట్‌ వర్గాలు అంచనాల వేస్తున్నాయి.

ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు:
ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలో దేశీ జీడీపీ ఏడేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రాబోయే ఆర్‌బీఐ పాలసీ సమావేశంలో రేటు తగ్గింపు అంచనాలను పెంచాయి. తయారీలో తిరోగమనం కొనసాగడంతో ఈ క్యూ3లో జీడీపీ 4.7శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. జూన్ - ఆగస్టులో ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఈసారి ఆర్‌బీఐ నుంచి పావుశాతం వడ్డీరేట్ల కోత ఉండవచ్చని ఆశిస్తున్నాము. ఫెడ్‌ సైతం పావుశాతం కోత విధించే అవకాశం ఉందని బ్యాంక్‌ఆఫ్‌అమెరికా మెర్లించ్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. You may be interested

లింక్‌కాని పాన్‌వాడితే.. పదివేలు కట్టాల్సిందే!

Monday 2nd March 2020

ఆధార్‌ కార్డుకు పాన్‌ కార్డును లింక్‌ చేయకపోతే భారీ జరిమాన చెల్లించక తప్పదని ఐటీ విభాగం హెచ్చరిస్తోంది. మార్చి 31 నాటికి ఆధార్‌ నంబరుకు పాన్‌ కార్డును లింక్‌ చేయకపోతే పాన్‌ కార్డును రద్దు చేస్తారు. ఇలా రద్దైన కార్డును ఎక్కడైనా వాడితే ఆదాయపు పన్ను  చట్టంలోని సెక‌్షన్‌ 272బి ప్రకారం రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇప్పటిదాక ఎవరైతే పాన్‌కార్డును ఆధార్‌తో

52 వారాల కనిష్టానికి 298 షేర్లు

Monday 2nd March 2020

సోమవారం 298 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. కనిష్టానికి పడిపోయిన షేర్లలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అలీకాన్‌ కాస్టలాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కోటెక్‌, ఆరో గ్రీన్‌టెక్‌, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అట్లాంటా, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోలైట్‌ ఇండియా, బజాజ్‌ హిందుస్థాన్‌ సుగర్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా, బియర్డ్‌సెల్‌, భండారీ హోసరీ ఎక్‌పోర్ట్స్‌, భారత్‌ గేర్స్‌, బిర్లా టైర్స్‌, బర్నపూర్‌

Most from this category