News


3శాతం పతనమైన రైట్స్‌

Friday 28th February 2020
news_main1582872764.png-32165

సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు మరింత వాటాను కల్పించే బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ రైట్స్‌ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతుండడంతో... శుక్రవారం ఇంట్రాడేలో రైట్స్‌ షేరు 3 శాతం పతనమై రూ.290 వద్ద ట్రేడ్‌ అవుతోంది.ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా ప్రభుత్వం రైట్స్‌ లిమిటెడ్‌లో 132 శాతం వాటాను  శుక్రవారం విక్రయానికి ఉంచింది. తద్వారా రూ.745 కోట్లను సమీకరించవచ్చని ఆశిస్తుంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నిన్న (గురువారం) ఇష్యూ ప్రారంభంకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు  శుక్రవారం(28న) దరఖాస్తు చేసుకునేందుకు వీలుకల్పించింది. ఓఎఫ్‌ఎస్‌లో డిమాండ్‌కు అనుగుణంగా అదనంగా 12.5 మిలియస్‌ షేర్లను సైతం విక్రయించేందుకు అనుమతి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. తద్వారా 10 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు వెల్లడించింది. ఇందుకు బుధవారం ముగింపు ధర రూ. 318తో పోలిస్తే 6 శాతం డిస్కౌంట్‌తో రూ. 298ను నిర్ణయించింది. కాగా.. 2019 నవంబర్‌లోనూ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా కంపెనీ 25 మిలియన్‌ షేర్లను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 77.39 శాతం వాటా ఉంది.
 



You may be interested

52 వారాల కనిష్టానికి 313 షేర్లు

Friday 28th February 2020

శుక్రవారం 313 షేర్లు  52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అర్బన​ఆఫ్‌షోర్‌, ABB ఇండియా, ACC, అగర్వాల్‌ ఇండస్ట్రీయల్‌ కార్పొరేషన్‌, అగ్రి టెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆంధ్రా సుగర్స్‌, ఆంధ్రా పేపర్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కిడ్‌ఫ్లే ఇండస్ట్రీస్‌, ఆర్చీస్‌, ఆర్కొటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీయల్‌లు

మైండ్‌ట్రీ 5శాతం డౌన్‌

Friday 28th February 2020

 ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీని డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సిటీగ్రూప్‌ ప్రకటించిన నేపథ్యంతో మైండ్‌ ట్రీ శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం పడిపోయింది. ఉదయం 11:20 గంటల ప్రాంతంలో మైండ్‌ ట్రీ షేరు 5 శాతం పతనమై రూ. 934.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కంపెనీ సానుకూలాంశాలు ఇప్పటికే షేరు ధరలో ఇమిడిపోయాయని, ప్రస్తుతం మైండ్‌ ట్రీ వ్యాపారం స్థిరంగా సాగుతున్నప్పటికీ కరోనా వైరస్‌ ప్రభావం, ప్రపంచ ఆర్థిక

Most from this category