News


రైట్స్‌, మహీంద్రా సీఐఈ పతనం

Thursday 27th February 2020
Markets_main1582785899.png-32138

ఆఫర్‌ ఫర్‌ సేల్‌తో రైట్స్‌ డీలా
మహీంద్రా సీఐఈకి క్యూ3 ఫలితాల దెబ్బ

సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు మరింత వాటాను కల్పించే బాటలో రైల్వే రంగ పీఎస్‌యూ రైట్స్‌ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌(ఓఎఫ్‌ఎస్‌)ను చేపడుతోంది. దీంతో ఈకౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సం‍వత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఆటో విడిభాగాల కంపెనీ మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

రైట్స్‌ లిమిటెడ్‌
ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా ప్రభుత్వం రైట్స్‌ లిమిటెడ్‌లో 5 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. తద్వారా 12.5 మిలియన్‌ షేర్లను విక్రయించనుంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు ఇష్యూ ప్రారంభంకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు శుక్రవారం(28న) దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఓఎఫ్‌ఎస్‌లో డిమాండ్‌కు అనుగుణంగా అదనంగా 12.5 మిలియస్‌ షేర్లను సైతం విక్రయించేందుకు అనుమతి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. తద్వారా 10 శాతం వాటాను విక్రయించేఊ వీలున్నట్లు వెల్లడించింది. ఇందుకు బుధవారం ముగింపు ధర రూ. 318తో పోలిస్తే 6 శాతం డిస్కౌంట్‌తో రూ. 298ను నిర్ణయించింది. కాగా.. 2019 నవంబర్‌లోనూ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా కంపెనీ 25 మిలియన్‌ షేర్లను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 77.39 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో రైట్స్‌ లిమిటెడ్‌ షేరు మధ్యాహ్నం 12 ప్రాంతంలో 5.2 శాతం పతనమై రూ. 302 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 300 వరకూ నీరసించింది.

మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్‌ నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 91 శాతం పడిపోయి రూ. 13 కోట్లకు పరిమితమైంది. పీబీటీ సైతం 33 శాతం క్షీణించి రూ. 182 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం తక్కువగా రూ. 1729 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో మహీంద్రా సీఐఈ షేరు మధ్యాహ్నం 12 ప్రాంతంలో 4 శాతం పతనమై రూ. 135 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 130 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.



You may be interested

సిమెంట్‌ స్టాకులపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 27th February 2020

సిమెంట్‌ రంగంలోని కంపెనీల షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. దేశవ్యాప్తంగా సిమెంట్‌ వినియోగం పెరగడం, తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయన్న అంచనాలతో సిమెంట్‌స్టాకులపై బ్రోకింగ్‌ సంస్థలు పాజిటివ్‌గా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరం దేశీయంగా క్లింకర్‌ వినియోగం 80 శాతాన్ని దాటుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దీంతో ఎబిటా పెరుగుదల ఆధారిత ధరల వృద్ధి నమోదవుతుందని తెలిపింది. పాజిటివ్‌ అంచనాలతో సిమెంట్‌ ధరలు స్థిరంగా ఉంటాయని, జనవరి- జూన్‌

సుప్రీం తీర్పుతర్వాతే నిర్ణయం: భారతీ ఇన్‌ఫ్రాటెల్‌

Thursday 27th February 2020

ఇండస్‌ టవర్స్‌ విలీనంపై భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ ఇండస్‌​ టవర్స్‌ను విలీనం చేసుకోవడంతో పాటు, ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ ఐడియాకు ఉన్న 7 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని క్లియరెన్స్‌లు పూర్తయినప్పటికి ఇండస్‌ టవర్స్‌ విలీనంతోపాటు, టవర్స్‌లోని వొడాఫోన్‌ ఐడియా 7 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను  మరో రెండు నెలలు పొడిగించనుంది. వొడాఫోన్‌ ఐడియాకు నగదు కొరతతో అనిశ్చితి నెలకొనడం,

Most from this category