News


ముకేశ్‌ మీడియా వ్యాపారాలన్నీ నెట్‌వర్క్‌ 18 కిందకు

Tuesday 18th February 2020
Markets_main1581964585.png-31866

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మీడియా, పంపిణీ వ్యాపారాలను విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేయనుంది. టెలివిజన్‌ 18 బ్రాడ్‌కాస్ట్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌లను నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విలీనం చేయనుంది. మెత్తం మీడియా వ్యాపారం అంతా  నెట్‌వర్క్‌ 18 కింద కొనసాగనుంది. కేబుల్‌ అండ్‌ ఐఎస్‌పీ వ్యాపారం రెండు సొంత సబ్సిడరీలుగా నెట్‌వర్క్‌ 18 కింద నడుస్తాయి. షేర్ల మార్పిడి రూపంలో ఈ విలీనం జరగనుంది. ఈ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం నెట్‌వర్క్‌ 18లో ఆర్‌ఐఎల్‌ వాటా 75 శాతం నుంచి 64 శాతానికి తగ్గుతుంది. వార్తలు, వినోదం, ఇంటర్నెట్‌, ఐఎస్‌పీ, కేబుల్‌ వ్యాపారాలతో నెట్‌వర్క్‌ 18 పోటీ సంస్థలైన జీ గ్రూపు, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, బెన్నెట్‌ కోల్‌మన్‌ (ఎకనమిక్‌ టైమ్స్‌ గ్రూపు) తదితర సంస్థలకు పోటీనివ్వనుంది. సోమవారం జరిగిన సమావేశాల్లో కంపెనీల బోర్డులు విలీనానికి నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ బీఎస్‌ఈకి సమాచారం కూడా ఇచ్చింది.

 

పునర్‌వ్యవస్థీకరణతో వ్యాల్యూ చెయిన్‌ అనుసంధానం, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలు పడుతుందని నెట్‌వర్క్‌ 18 తన ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఈ విలీనం కార్పొరేట్‌ నిర్మాణ పరంగా లిస్టెడ్‌ కంపెనీలను తగ్గించి నిర్వహణ సౌలభ్యాన్ని పెంచనుంది. విలీనం అనంతరం నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం రూ.8,000 కోట్ల స్థాయికి చేరుతుంది. లిస్టెడ్‌ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా అవతరిస్తుంది. అలాగే, రుణ రహిత కంపెనీగానూ మారుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డెన్‌, హాత్‌వే సంస్థలు సంయుక్తంగా 1.5 కోట్ల ఇళ్లకు సేవలు అందిస్తాయి. 10 లక్షల వైర్‌లైన్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ చందాదారులను కలిగి ఉంటుంది. టీవీ18లో ప్రతీ 100 షేర్లు కలిగి ఉన్న వారికి 92 నెట్‌వర్క్‌ 18 షేర్లు కేటాయిస్తారు. అలాగే హాత్‌వేలో ప్రతీ 100 షేర్లకు 78 నెట్‌వర్క్‌ 18 షేర్లు కేటాయిస్తారు. ప్రతీ 100 డెన్‌నెట్‌వర్క్స్‌ షేర్లకు 191 నెట్‌వర్క్‌ 18 షేర్లు కేటాయిస్తారు.  You may be interested

ఐఆర్‌సీటీసీ అద్భుత ప్రదర్శన ఎందుకు..?

Tuesday 18th February 2020

రైల్వే శాఖ అనుబంధ కంపెనీ ఐఆర్‌సీటీసీ ఐపీవోకు వచ్చిన ఐదు నెలల్లోనే ఐదింతలు పెరిగి ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను ఇచ్చింది. అక్టోబర్‌ 3న ఐపీవో ముగియగా ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.320. ప్రస్తుత ధర రూ.1518. ఈ అసాధారణ ర్యాలీ ఇన్వెస్టర్లను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ, ఇందుకు సహేతుక కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.   స్థిరమైన పనితీరు ఐఆర్‌సీటీసీ అన్నది భిన్నమైన కంపెనీ. లిస్టెడ్‌ కంపెనీల్లో ఈ తరహా

ఏడాది కోసం టాప్‌ సిఫార్సులు

Monday 17th February 2020

వచ్చే సంవత్సర కాలంలో మంచి రాబడినిచ్చే సత్తా ఉన్న షేర్లను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 1. కోల్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 258. థర్మల్‌ కోల్‌ మనుగడపై సందేహాలున్నా, ప్రస్తుతానికి దేశీయ విద్యుదుత్పాదనలో బొగ్గు డామినేషన్‌ కొనసాగుతుందని అంచనా. వచ్చే మూడేళ్లలో వాల్యూంలు 5 శాతం పెరగవచ్చు. దీనికితోడు కంపెనీ తీసుకుంటున్న సామర్ధ్య పెంపు చర్యల కారణంగా ఎబిటా వచ్చే మూడేళ్లు 3 శాతం చక్రీయవార్షిక వృద్ధి నమోదు చేయగలదు. 2.

Most from this category