News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు

Tuesday 19th November 2019
Markets_main1574145179.png-29702

దేశీయ ప్రైవేట్‌ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మంగళవారం మరో కొత్త గరిష్టస్థాయిని నమోదు చేయడంతో పాటు రూ. 1,500 స్థాయిని అధిగమించింది. బీఎస్‌లో ఎక్చ్సేంజీలో నేడు ఈ కంపెనీ షేరు రూ.1467.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ 01 నుంచి ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు కాల్‌ సర్వీసు ఛార్జీలు పెంచనున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సైతం సంస్థ జియో సైతం ఛార్జీలను పెంచవచ్చనే అంచనాలతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన ఈ షేరు ఒకదశలో 3.30శాతం ర్యాలీ చేసి రూ.1500ల స్థాయిని అధిగమించి రూ.1506.45 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.12:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1458.50)తో పోలిస్తే 3.26శాతం లాభంతో రూ.1506.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9.42లక్షల కోట్లుగా నమోదైంది. కాగా ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరసుగా రూ.1017.00, రూ.1489.50లుగా నమోదయ్యాయి. త్రైమాసికంలో భారీ నష్టాలు, మొండి బకాయిలు పెరగడం,  సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటం లాంటి తాజా పరిణామాల నేపథ్యంలో టారిఫ్‌లను సమీక్షించుకుంటున్నాయి. టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్‌-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 1 నుంచి కాల్‌చార్జీలను పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ర్యాలీతో ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 207 పాయింట్ల లాభంతో 40,492.16 వద్ద, నిఫ్టీ 58.30 పాయింట్లు పెరిగి 11,942.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ప్రభుత్వ బ్యాంకుల్లో పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు.!

Tuesday 19th November 2019

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు పనితీరు ఆధారంగానే ప్రోత్సాహకాలను చెల్లించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 8లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలను అందిస్తున్నారు. ‘‘ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలు’’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు పీఎస్‌యూ బ్యాంకులు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఉన్నతస్థాయి అధికారులకు ఈ పద్దతిని అమలు చేసే యోచనలో ఉన్నాయి. ప్రస్తుతం

టెలికం షేర్లను కొనొచ్చా?

Tuesday 19th November 2019

కదం తొక్కుతున్న ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ షేర్లు మూడు సెషన్లుగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌) షేర్లు భారీ ర్యాలీ జరుపుతున్నాయి. క్యు2లో రికార్డు నష్టాలు ప్రకటించిన ఈ కంపెనీల షేర్లపై ఒక్కమారుగా ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగింది. మంగళవారం ట్రేడింగ్‌లో వీఐఎల్‌ షేరు దాదాపు 30 శాతం, ఎయిర్‌టెల్‌ షేరు సుమారు 6 శాతం లాభపడ్డాయి. డిసెంబర్‌ 1 నుంచి టారిఫ్‌లు పెంచుతామని రెండు కంపెనీలు ప్రకటించాయి. దీంతో రెండు కౌంటర్లలో కొనుగోళ్ల జోరు

Most from this category