News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 10శాతం ర్యాలీ

Wednesday 25th March 2020
Markets_main1585119676.png-32668

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ చర్చలు జరుపుతోందనే వార్తలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 10శాతం లాభపడింది. వాటా విక్రయవార్తలో రిలయన్స్‌ షేరు నేడు బీఎస్‌ఈలో మునుపటి ముగింపు(రూ.943.10)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.951.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో దాదాపు 10శాతం పెరిగి రూ.1000మార్కును అధిగమించి రూ.1035.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం 11గంటలకు షేరు నిన్నటి ముగింపుతో పోలిస్తే 8.50శాతం లాభపడి రూ.1022 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.875.10, రూ.1671.80గా నమోదయ్యాయి. 


రిలయన్స్‌లో వాటాలపై ఫేస్‌బుక్‌ కన్ను..!?
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కన్నేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్‌ సిద్దవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ ఆపరేషన్స్ లో తన పరిధిని మరింత విస్తరించుకోవాలని ఫేస్ బుక్ యోచిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్  సమాచారం ప్రకారం భారతీయ డిజిటల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకునేందుకు ముకేశ్‌ అంబానీ  డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోలో మల్టీ బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి  చర్చలు జరుపుతోంది. ఈ నెలాఖరులో ఫేస్‌బుక్‌తో ఈ ఒప్పందం  జియో ప్రకటించాల్సి ఉంది. సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ దిగ్గజం ఫేస్ బుక్ 10 శాతం వాటా కోసం ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేయడానికి  సిద్ధంగా వుందని, అయితే  కోవిడ్ -19 కరోనావైరస్ వ్యాప్తి  ప్రపంచ ప్రయాణ నిషేధాల కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయాయని తెలిపింది. మార్చి 2021 నాటికి  రిలయన్స్ సంస్థ అప్పులేని సంస్థగా మార్చే ప్రణాళికల్లో   ఈ  విక్రయం చోటు చేసుకోనుందని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. అయితే  ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి  రిలయన్స్ ప్రతినిధి నిరాకరించినట్టు తెలుస్తోంది. 



You may be interested

రూ.41వేల పైకి బంగారం ధర

Wednesday 25th March 2020

బంగారం ధర వరుసగా మూడో రోజూ పెరిగింది. గత వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర వరుస 3రోజుల ర్యాలీతో తిరిగి రూ.41వేల మార్కును అందుకుంది. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ ఆర్థిక వ్యస్థలను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనలు బలోపేతం చేసేందుకు అమెరికాతో పాటు వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ఉద్దీపనలు ప్రకటింస్తుండటంతో బంగారం «ధర బుధవారం లాభపడింది. దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటి

ఉద్యోగులను తొలగించొద్దు.. వేతనాల్లో కోత పెట్టొద్దు

Wednesday 25th March 2020

పరిశ్రమలకు నిపుణుల సూచన న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక మందగమనం ముప్పు నేపథ్యంలో కంపెనీలు మానవీయ కోణంలో నడవాలని, ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాలను కోత విధించడం చేయరాదని నిపుణులు సూచించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో,  ముఖ్యంగా తయారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడడం వల్ల, వాటిల్లో పనిచేస్తున్న రోజువారీ వేతన కార్మికులకు ఉపాధి కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఉద్యోగుల భద్రతకు

Most from this category