News


బ్రోకరేజ్‌ల టాప్‌5 సిఫార్సులు

Monday 11th November 2019
Markets_main1573469103.png-29509

వచ్చే 8 నుంచి 10 నెలల్లో 11-17 శాతం రిటర్న్‌లను ఇవ్వగలిగే టాప్‌ 5 స్టాకులను బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్నాయి. ఆ టాప్‌ 5 స్టాకులు ఇవే....

 

బ్రోకరేజి: ఆనంద్‌ రాఠి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: కొనచ్చు; టార్గెట్‌: రూ. 1,610; రిటర్న్‌: 11.4 శాతం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రిటైల్‌ వ్యాపారం, గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ ఆదాయం  గత ఆరేళ్లలో ఏడు రెట్లు పెరగగా, లాభం 14 రెట్లు పెరిగింది. దీంతో పాటు రిలయన్స్‌ జియో ఇప్పటికే ఇండియాలో అతి పెద్ద నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా ఎదిగింది. అంతేకాకుండా ఇంకా కొత్త రిజిస్ట్రేషన్‌లు ప్రతి నెలా లక్షల్లో జరుగుతున్నాయి. రిలయన్స్‌ కొత్త వ్యాపారాలు వేగంగా వృద్ధి చెందుతుండడంతో కంపెనీ వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి నమోదు చేయగలమని విశ్వసిస్తోంది. రిలయన్స్‌ వినియోగ ఆధారిత వ్యాపారాలైన రిలయన్స్‌ జియో, రిటైల్‌ కంపెనీలలో  పెట్టుబడులు పెట్టడానికి వ్యూహాత్మక భాగస్వాములు ముందుకొస్తున్నారు. వచ్చే కొన్ని త్రైమాసికాలలో అంతర్జాతీయంగా పేరు పొందిన భాగస్వాములను కంపెనీలోకి ఆహ్వానించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రణాళికలు వేస్తోంది. అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో రిలయన్స్‌ జియో, రియలన్స్‌ రిటైల్‌ కంపెనీలను మార్కెట్‌లో లిస్ట్‌ చేయాలని భావిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ గరిష్ఠంగా ఉండడంతో, కంపెనీ షేరుపై ఆర్‌ఓఐ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ) మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా రిలయన్స్‌ జియో కొత్తగా ఐఓటీ(ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), హోం బ్రాడ్‌ బాండ్‌ సర్వీసెస్‌, ఎంటర్‌ప్రైజెస్‌ బ్రాడ్‌బాండ్‌ సర్వీస్‌, చిన్న, మధ్యతరహ వ్యాపారాలకు బ్రాడ్‌బాండ్‌ సర్వీస్‌లను అందించే కొత్త ఆదాయ మార్గాలను ప్రారంభిస్తోంది. వీటి నుంచి ఆర్థిక సంవత్సరం 2020లో రెవెన్యూ పొందనుంది. ఈ స్టాకుపై ‘బై’ టార్గెట్‌ను కలిగివున్నాం. 

 

ఐసీఐసీఐ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 569; రిటర్న్‌: 16.4 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌, వచ్చే జూన్‌ నాటికి బ్యాంక్‌ షేరుపై 15 శాతం ఏకికృత ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ)ని సాధించేందుకు మార్గదర్శకాలను ఇచ్చింది. బలమైన బ్రాండ్‌ ప్రాంచైజీ ఉండడంతోపాటు, బ్యాంక్‌ ఆస్తి నాణ్యత ధోరణి, వ్యూహత్మక దృష్ఠి వంటి అంశాల వలన, ఈ బ్యాంక్‌, రిటర్న్‌ నిష్పత్తులను మెరుగుపరుచుకుంటూ నిలకడగా కొనసాగుతోంది. వచ్చే రెండేళ్ల కాలానికి గాను కంపెనీ స్టాండ్‌ ఎలోన్‌ ఎన్‌ఐఐ(నికర వడ్డీ ఆదాయం) మెరుగుపడి, 17 శాతం సీఏజీఆర్‌(కాంపౌండ్‌ యాన్యుల్‌ గ్రోత్‌ రేట్‌) వద్ద ఉంటుందని అంచనావేస్తున్నాం. ఆరోగ్యకరమైన అడ్వాన్స్‌ల వృద్ధి, అధిక నాణ్యత కలిగిన డిపాజిట్‌ ప్రాంచైజీలలో ‘క్రాష్‌ సేల్‌ అవకాశాలు’ వలన బ్యాంక్‌ బలమైన ఎన్‌ఐఐలను ప్రకటిస్తోంది. వీటితో పాటు వచ్చే రేండేళ్లలో బ్యాంక్‌ పీఏటీ(పన్ను తర్వాత లాభం) సీఏజీఆర్‌ 111 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. క్రెడిట్‌ ఖర్చులు తక్కువగా ఉండడంతోపాటు, అడ్వాన్స్‌లు, ఎన్‌ఐఐ వృద్ధి బాగుండడంతో ఈ బ్యాంక్‌ లాభదాయకత బాగుంటుందని అంచనావేస్తున్నాం. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభదాయకత, రిటర్న్‌ రేషియో విషయంలో మంచి స్థాయిలో ఉందని నమ్ముతున్నాం. ఈ బ్యాంక్‌ షేరును రూ. 569 టార్గెట్‌ ధర కోసం కొనుగోలు చేయాలని సలహాయిస్తున్నాం. 

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,410; రిటర్న్‌: 12.4 శాతం
డిపాజిట్ సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నామని, రుణ పుస్తకపు వృద్ధికి తోడ్పాటునందించడానికి డిపాజట్లను స్థిరంగా పెంచుతున్నామని బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. డిపాజిట్ ఖాతాలకు వెలుపల ఉన్న నగదు నిర్వహణకు సంబంధించిన ఇన్‌ఫ్లోలను సర్దుబాటు చేయడంతోపాటు, దీర్ఘకాలిక సంస్థాగత నిధుల వలన బ్యాంక్‌ క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 75% కి తగ్గింది. బ్యాంకింగ్‌ రంగం‍లో మంచి స్థానంలో ఉండడంతో పాటు, ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌ షీట్‌ నిర్వహణ, ఉన్నతమైన ఆస్తి నాణ్యత, నిర్వహణ వంటి అంశాల వలన, బ్యాంక్‌ స్థిరంగా బలమైన మార్జిన్లను, రిటర్న్‌ నిష్పత్తి వృద్ధిని అందించే స్థాయిలో ఉందని నమ్ముతున్నాం. మధ్యస్థ, దీర్ఘకాలానికి గాను ఈ స్టాకుపై కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. 

 

బ్రోకరేజి: ఎస్‌ఎంసీ గ్లోబల్‌

యాక్సిస్‌ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 856; రిటర్న్‌: 17 శాతం
ఉన్నతమైన ఆపరేటింగ్‌ అంశాలతోపాటు, ఒత్తిడిలో ఉన్న ఆస్తి రిజల్యూషన్‌, రిటర్న్‌ రేషియో బలంగా ఉండడంతో ముందుకెళ్లే కొద్ది ఈ స్టాకు మంచి ప్రదర్శన చేస్తుందని అంచనావేస్తున్నాం. బ్యాంక్‌ ఆర్థిక పనితీరులో బ్యాంక్‌ రిటైల్‌ విభాగం కీలకంగా కొనసాగుతోంది. అంతేకాకుండా బ్యాంక్‌ డిజిటల్‌ సేవలు విస్తరిస్తుండడంతో, బ్యాంక్‌ మార్కెట్‌ షేరును పొందడంతోపాటు, వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తోంది. అందువలన ఈ స్టాకు వచ్చే 10 నెలలలో రూ. 856 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయమని సలహాయిస్తున్నాం.

 

గుజరాత్‌ గ్యాస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 223; రిటర్న్‌: 15 శాతం
గుజరాత్‌ గ్యాస్‌ బలమైన, స్థిరమైన ఆదాయ వృద్ధి మూమెంటంను, స్థిరమైన మార్జిన్‌లను కలిగివుంది. పీఎన్‌జీ కనెక్షన్‌లు, అదనపు సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయడం వలన ప్రస్తుత ఆపరేటింగ్ ఏరియాల్లో మరింతగా చొచ్చుకుపోవటంపై కంపెనీ దృష్ఠి పెట్టింది. కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాలలో పంపిణీ సామర్ధ్యాన్ని పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఫలితంగా రానున్న కొన్నేళ్లలో కంపెనీ బలమైన రెవెన్యూ, లాభాలను ఈ ప్రాంతాల నుంచి సాధిస్తుందని అంచనావేస్తున్నాం. అందువలన వచ్చే 10 నెలలో రూ. 223 టార్గెట్‌ ధర కోసం ఈ కంపెనీ షేరు కొనుగోలు చేయమని సలహాయిస్తున్నాం.You may be interested

వీటికి ‘సెల్‌’ రేటింగ్‌ కొనసాగింపు

Tuesday 12th November 2019

ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం మూడు స్టాక్స్‌కు సెల్‌ రేటింగ్‌ కొనసాగించాయి. కాకపోతే గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను పెంచడం వీటికి కాస్తంత ఉపశమనం.    ఇప్కా ల్యాబొరేటరీస్‌ సీఎల్‌ఎస్‌ఏ ఈ స్టాక్‌కు విక్రయించండి (సెల్‌) రేటింగ్‌ను కొనసాగించింది. కాకపోతే గతంలో టార్గెట్‌ కింద రూ.810 ఇవ్వగా, తాజాగా దీన్ని రూ.950కు పెంచింది. నిర్వహణ ప్రయోజనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేస్తోంది. కార్పొరేట్‌ పన్ను భారీ

ప్రైవేట్‌ బ్యాంకుల స్వర్ణయుగం ముగిసిందా?

Monday 11th November 2019

నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ మధ్య ఇన్వర్స్‌ రొటేషన్‌ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు నిఫ్టీ అత్యుత్తమ ప్రదర్శన జరుపుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకు షేర్ల అద్భుత ర్యాలీతో బ్యాంకు నిఫ్టీ బలమైన ర్యాలీ చూపింది. పీఎస్‌యూ బ్యాంకుల ఆస్తుల నాణ్యతపై నీలినీడలు ముసురుతుంటే ప్రైవేట్‌ బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా మెరుగుపడుతూ వచ్చింది. దీంతో పీఎస్‌బీల కన్నా ప్రైవేట్‌బ్యాంకు షేర్లు మంచి లాభాలు చూశాయి. మొత్తం 8 ప్రైవేట్‌ బ్యాంకు

Most from this category