News


ఆర్‌ఐఎల్‌ ఈపీఎస్‌ అంచనాల కుదింపు

Monday 20th January 2020
Markets_main1579504522.png-31046

బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్న సీఎల్‌ఎస్‌ఏ
నోమురా ఇండియా టార్గెట్‌ రూ. 2020
జియోమార్ట్‌ ద్వారా కిరాణా డిజిటలైజేషన్‌?!

ఈ ఏడాది మూడో త్రైమాసిక(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించాక డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌పట్ల సానుకూల ధోరణిని కొనసాగిస్తున్నట్లు పలు బ్రోకింగ్‌ సంస్థలు తెలియజేశాయి. అయితే పెట్రోకెమ్‌ బిజినెస్‌ బలహీనతల నేపథ్యంలో 2020లో ఆర్‌ఐఎల్‌ ఆర్జన 4-6 శాతంమేర నీరసించవచ్చని కొన్ని రీసెర్చ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్‌ మందగమనం, ఆరోమాటిక్‌, పాలిమర్స్‌ విభాగంలో కొత్త సామర్థ్యాలు, నాఫ్టా, ఇథేన్‌ ధరలు పెరగడం వంటి అంశాలు ఆర్‌ఐఎల్‌ అంచనాలలో కోతకు కారణమని నోమురా ఇండియా పేర్కొంది. క్యూ3లో రిఫైనింగ్‌ బిజినెస్‌ మార్జిన్లు అంచనాలను అందుకున్నాయని తెలియజేసింది. నిర్వహణ లాభం అంచనాలకంటే 6 శాతం అధికంగా నమోదుకాగా.. ఏఆర్‌పీయూలు క్షీణించడంతో జియో నిర్వహణ లాభం 8 శాతం దిగువన రూ. 5600 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. అయితే టారిఫ్‌ల పెంపు, పెరుగుతున్న మార్కెట్‌ వాటా, సర్వీసుల విస్తరణ వంటి అంశాలు జియోను పటిష్టంగా నిలపనున్నట్లు అభిప్రాయపడింది. దీంతో రూ. 2020 టార్గెట్‌ ధరతో ఆర్‌ఐఎల్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తున్నట్లు నోమురా ఇండియా పేర్కొంది. 

మోర్గాన్‌ స్టాన్లీ ఇలా
రీసెర్చ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ ఆర్‌ఐఎల్‌ షేరుకి ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇచ్చింది. రూ. 1753 టార్గెట్‌ ధరను ప్రకటించింది. సవాళ్లు ఎదురైనప్పటికీ రిఫైనింగ్‌ బిజినెస్‌ సంతృప్తికర పనితీరు చూపినట్లు తెలియజేసింది. అయితే టెలికం ఫలితాలు అంచనాలకంటే తక్కువగా నమోదైనట్లు పేర్కొంది. ఇక ఆర్‌ఐఎల్‌ షేరు కొనుగోలుకి మరో విదేశీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సిఫారసు చేస్తోంది. రూ. 2010 టార్గెట్‌ను ప్రకటించింది. 2020 ఈపీఎస్‌ అంచనాలను 6 శాతంమేర తగ్గించింది. ఈ బాటలో జేపీ మోర్గాన్‌ సైతం వచ్చే రెండేళ్లలో ఆర్‌ఐఎల్‌ ఈపీఎస్‌ అంచనాలలో 4-5 శాతంమేర కోత పెడుతున్నట్లు పేర్కొంది. 

ఎమ్కే టార్గెట్‌ రూ. 1740
20-21-22లో ఆర్‌ఐఎల్‌ నిర్వహణ లాభం(ఇబిటా) 4-2-1 శాతం చొప్పున తగ్గవచ్చునంటూ ఎమ్కే గ్లోబల్‌ అంచనా వేసింది. పెట్రోకెమ్‌ బిజినెస్‌ బలహీనతలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే రిలయన్స్‌ రిటైల్‌, జియో ఇన్ఫోకామ్‌ పటిష్ట పనితీరు చూపనున్నట్లు అభిప్రాయపడింది. దీంతో ఆర్‌ఐఎల్‌ షేరుకి రూ. 1740 టార్గెట్‌ ధరను ఇచ్చింది. 6000 రిటైల్‌ ఔట్‌లెట్స్‌, 5,000 జియో టచ్‌ పాయింట్స్‌, పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ వంటి అంశాలు ఆర్‌ఐఎల్‌ షేరుకి మరింత బలాన్ని చేకూర్చనున్నట్లు ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ వివరించింది. జియోమార్ట్‌ ద్వారా మెగా రిటైల్‌ వెంచర్‌ను ప్రారంభించిన ఆర్‌ఐఎల్‌ దేశీ రిటైల్‌ మార్కెట్‌ ముఖచిత్రాన్ని డిజిటలైజ్‌ చేయగలదని వ్యాఖ్యానించింది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ: గరిష్టం నుంచి 578 పాయింట్లు డౌన్‌

Monday 20th January 2020

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం మిడ్‌సెషన్‌ గరిష్టస్థాయి నుంచి 578 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3 ఫలితాలు అంచనాలు మించిన నమోదు కావడంతో నేడు ఈ భారీ గ్యాప్‌లో ప్రారంభమైంది. ఫలితంగా నేడు ఈ ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,590.65)తో పోలిస్తే 334 పాయింట్ల భారీ లాభంతో 31,923.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అనంతరం మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల్లో ఇండెక్స్‌ ఇదే

రికార్డుస్థాయి నుంచి నిఫ్టీ 12,300 దిగువకు!

Monday 20th January 2020

గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ 42వేల మార్కును కోల్పోయిన సెన్సెక్స్‌  మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 42వేల దిగువకు, నిఫ్టీ 12300 కిందకు చేరుకున్నాయి. సూచీల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ, చోటు చేసుకోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల భయాలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలో సూచీలు గరిష్టస్థాయిలకు అందుకునేందుకు దోహదపడిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలతో

Most from this category