News


ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌ షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 24th September 2019
Markets_main1569318577.png-28520

ప్రభుత్వం  కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్యాక్స్‌ కట్‌ ప్రభావం మంగళవారం తగ్గినట్టు‍ కనిపిస్తున్నప్పటికి, ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌) ఇండికేటర్‌లో 66 స్టాకులు బలమైన బుల్‌ సంకేతాలనిస్తున్నాయని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. ఈ స్టాకులు, టెక్నికల్‌ చార్టులలో ‘బుల్లిష్‌ క్రాస్‌ ఓవర్‌’ నమూనాను ఏర్పాటు చేశాయని, అంతేకాకుండా తాజాగా బలమైన ట్రేడింగ్‌ వాల్యుమ్‌లను చూశాయని విశ్లేషకులు వివరించారు. ఈ స్టాకులలో నిఫ్టీ 50కి చెందిన ఆర్‌ఐఎల్(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌), హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్ స్టాకులున్నాయి. మిగిలిన షేర్లలో సుజ్లాన్ ఎనర్జీ, టాటా గ్లోబల్ బేవరేజెస్, యునైటెడ్ స్పిరిట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, రైల్ వికాస్ నిగం, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, బాటా ఇండియా షేర్లు టెక్నికల్‌ చార్టులో బుల్లిష్ క్రాస్ఓవర్‌ నమూనాను ఏర్పరిచాయి.  కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎన్‌టీపీసీ, డాబర్ ఇండియా, బయోకాన్, లుపిన్, పీటీసీ ఇండియా, ఉషా మార్టిన్, శ్రీ రేణుకా షుగర్స్, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్, అజంతా ఫార్మా తదితర 23 స్టాకులు టెక్నికల్‌ చార్టుల్లో బేరిష్ ట్రెండ్‌ను ఏర్పరిచాయి. 

ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాస్‌ ఓవర్‌ అంటే?
    ఎవైనా స్టాకులు లేదా సూచీల ట్రెండ్‌ రివర్సల్‌ను తెలుసుకోవడంలో ఎంఏసీడీ సహాయపడుతుంది. 26 రోజులు, 12 రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ల బేదాన్ని ఎంఏసీడీ లైన్‌గా భావిస్తారు. అదే 9 రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. ఒకవేళ ఎంఏసీడీ లైన్‌, సిగ్నల్‌ లైన్‌ దాటి పైకి​వెళితే, అది బుల్లిష్‌ సంకేతమని, అదేవిధంగా ఎంఏసీడీ లైన్‌, సిగ్నల్‌ లైన్‌ దాటి దిగువకు వస్తే బేరిస్‌ సంకేతమని సాంకేతిక విశ్లేషకులు అంచనా వేస్తారు. కేవలం ఎంఏసీడీ సూచీ మాత్రమే ట్రేడింగ్‌ కాల్‌ను తీసుకోడానికి సరిపోదని విశ్లేషకులు తెలిపారు. ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఒకే సూచీపై ఎప్పుడూ ఆధారపడవద్దని విశ్లేషకులు సలహాయిస్తున్నారు. 

ఇన్వెస్ట్‌ చేసే సమయం దాటింది..కానీ..
   ‘మార్కెట్‌లో భారీ ర్యాలీ ముగిసింది. ఇన్వెస్ట్‌చేయడానికి ప్రస్తుతం సమయం సరియైన కాదు’ అని ఎంజెల్‌ బ్రోకింగ్‌, రుచిత్‌ జైన్‌ అన్నారు. ‘కానీ మార్కెట్‌ ఇంకా బుల్లిష్‌ ట్రెండ్‌లోనే ఉంది. ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వాళ్లు పడిపోయిన షేర్లను కొనుగోలు చేయడం మంచిది. నిఫ్టీకి 11,400-11,300 పరిధిలో తక్షణ మద్ధతు లభించనుంది. స్వల్పకాలానికి గాను 11,705-11,800 స్థాయిల వద్ధ తక్షణ నిరోధం ఉంది’ అని ఆయన అన్నారు. దేశీయ సూచీలు మరింతా పెరిగేలోపు గరిష్ఠాల నుంచి కొద్ది మొత్తంలో దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌, సాంకేతిక విశ్లేషకులు నాగరాజ్‌ శెట్టీ అన్నారు. 11,800 వద్ద నిఫ్టీకి తక్షణ నిరోధం ఎదురుకానుందని తెలిపారు.You may be interested

సెన్సెక్స్‌ ప్లస్‌...నిఫ్టీ మైనస్‌

Tuesday 24th September 2019

11600 దిగువన నిఫ్టీ ముగింపు లాభాల స్వీకరణ, బ్యాంకింగ్‌ షేర్ల  పతనం రెండురోజుల బ్లాక్‌బాస్టర్‌ ర్యాలీ తర్వాత మంగళవారం రోజం‍తా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ 11600 స్థాయిని కోల్పోగా సెన్సెక్స్‌ 36000 స్థాయిని నిలబెట్టుకుంది. నిఫ్టీ 12 పాయింట్లను కోల్పోయి 11,588.20 వద్ద, సెన్సెక్స్‌ 7.11 పాయింట్లు స్వల్ప లాభంతో 39,097 వద్ద స్థిరపడ్డాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్ల పతనంతో పాటు

డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలతో మరింత పెరిగిన బీపీసీఎల్‌

Tuesday 24th September 2019

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం వలన ప్రభుత్వం ద్రవ్యలోటు ఒత్తిళ్లను ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ ఒత్తిళ్లను ఎదుర్కోడానికి ప్రభుత్వం, ప్రభుత్వరంగ యూనిట్ల నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటుందని అంచనాలు మార్కెట్‌ వర్గాలలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపీతే మొదట ప్రభుత్వం రంగం సంస్థయిన భారత పెట్రోలియం కార్పోరేషన్‌(బీపీసీఎల్‌)లో జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా గత మూడు సెషన్‌ల నుంచి బీపీసీఎల్‌ షేరు ర్యాలీ చేస్తోంది.

Most from this category