News


మార్కెట్లు ఎటు...? ఇన్వెస్టర్ల మార్గం ఎటు?

Sunday 14th July 2019
Markets_main1563126785.png-27050

అంతర్జాతీయంగా బలహీన వాతావరణం నడుమ కేంద్ర బడ్జెట్‌ ఆశించిన విధంగా లేకపోవడం, చైనా గణాంకాలు బలహీనంగా ఉండడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురికొల్పడంతో, గత వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బేర్స్‌ దెబ్బకు బుల్స్‌ వణికిపోయాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా రెండో వారంలో 1.97 శాతం, 2.18 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల గమనం ఏ విధంగా ఉండనున్నది, ఇన్వెస్టర్లు అనుసరించతగిన విధానంపై మార్కెట్‌ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలంటే వారి ట్వీట్లను పరిశీలించాల్సిందే...

 

ఐథాట్‌ సహ వ్యవస్థాపకుడు శ్యామ్‌శేఖర్‌ మాత్రం మార్కెట్లలో అమ్మకాలు త్వరలోనే ముగింపునకు వస్తాయన్నారు. ‘‘అమ్మకాలు సైతం వర్షపాతం లాంటిదే. అది ఎక్కడో అక్కడ ఆగిపోవాల్సిందే. మార్కెట్లలో అమ్మకాల వంటి మాన్‌సూన్‌ త్వరలోనే ముగిసిపోతుంది’’ అని శ్యామ్‌శేఖర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు సరిగ్గా ఉండాలని శేఖర్‌ సూచించారు. ‘‘పెట్టుబడికి సంబంధించి నిర్ణయానికి రావడానికి ముందు ఎంతో పరిశోధన, అధ్యయనం చేయాలి. జీపీఎస్‌ సాయంతో ప్రదేశానికి చేరినంత సులభంగా స్టాక్‌ ఐడియాలను కూడా తేల్చేస్తే కచ్చితంగా అది సురక్షితం కాబోదు’’అని శేఖర్‌ మరో ట్వీట్‌లో సూచించారు. పెద్ద తప్పిదాలతోనే కొనసాగడం కంటే, వాటికి వేగంగా స్పందించడం ఎంతో ముఖ్యమన్నారు శేఖర్‌. ‘‘ఒక స్టాక్‌ పదేళ్ల కాలంలో తన విలువలో రెండొతులు కోల్పోతే, మరో స్టాక్‌ ఏడాదిలోనే రెండొంతులు నష్టపోవచ్చు. స్లో పాయిజన్‌ కంటే, తలపై దెబ్బకే ఎక్కువగా ప్రతిస్పందిస్తాం’’అని శేఖర్‌ అన్నారు. 

 

మరో మార్కెట్‌ నిపుణుడు సందీప్‌ సభర్వాల్‌ సైతం ఆర్థిక రంగ రికవరీ త్వరలోనే ఉంటుందన్న అంచనా వ్యక్తం చేశారు. ‘‘జూన్‌ నుంచి ఆర్థిక పరిస్థితులు తేలికపడుతున్నట్టు ఎన్నో సంకేతమిస్తున్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణత, రేట్ల కోత ఆర్థిక రంగ రికవరీకి ఊతమిస్తాయి. విశ్లేషకులు దీన్ని తర్వాత గమనిస్తారు’’ అని సభర్వాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ పన్నుల విధానాలు సైతం ఆర్థిక రంగ రికవరీకి, ఉద్యోగాల కల్పనకు మద్దతుగా ఉన్నాయని మరో ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. బాండ్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయంలో సభర్వాల్‌ హెచ్చరించారు. వినియోగరంగ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయంగా సూచించారు. టైటాన్‌ వంటి స్టాక్స్‌ విషయంలో గరిష్ట స్థాయి నుంచి 25 శాతం దిద్దుబాటు అన్నది ప్రవేశానికి సరైన ధరగా పేర్కొన్నారు.  You may be interested

టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ జూన్‌లో ఏం కొన్నాయి...?

Sunday 14th July 2019

ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ప్రతీ నెలా వివిధ పథకాల పరిధిలో తమ పోర్ట్‌ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. సెబీ నిబంధనలు  ఈ మేరకు నిర్దేశిస్తున్నాయి. ఆయా గణాంకాల ‍ప్రకారం జూన్‌ నెలలో టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) కొనుగోలు చేసిన, విక్రయించిన స్టాక్స్‌ వివరాలు ఇవి...   హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈ సంస్థ నిర్వహణలో 22 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు ఉన్నాయి. ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో 35 శాతం,

క్రూడాయిల్‌ ర్యాలీ కొనసాగదు!

Saturday 13th July 2019

తాత్కాలిక పరిస్థితుల వల్ల తాజా పెరుగుదల  దీర్ఘకాలానికి డౌన్‌ట్రెండే అంతర్జాతీయ నిపుణుల అంచనా చమురు మార్కెట్లో ప్రస్తుతం అప్‌మూవ్‌ కనిపిస్తోంది. గల్ఫ్‌ ఉద్రిక్తతలు, వెనుజులా, ఇరాన్‌ పరిణామాలు, ఒపెక్‌ ఉత్పత్తి కోతలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇతర దేశాల్లో ఉత్పత్తి క్షీణించడం.. లాంటివి చమురు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అయితే ఈ అప్‌మూవ్‌కు జీవం చాలా తక్కువని, ర్యాలీ మరింత కాలం కొనసాగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ర్యాలీలో బ్రెంట్‌ మరోమారు 70 డాలర్లను దాటవచ్చని

Most from this category