News


ఈ మూడు థీమ్స్‌ డిసైడ్‌ చేస్తాయి!

Wednesday 20th March 2019
Markets_main1553071169.png-24714

మార్కెట్‌పై మోర్గాన్‌స్టాన్లీ
మరో ఆరేడేళ్లు కొనసాగే బలమైన ఎర్నింగ్స్‌ గ్రోత్‌ సైకిల్‌లోకి భారత్‌ ప్రవేశిస్తోందని మోర్గాన్‌స్టాన్లీ భారత ఈక్విటీ వ్యూహకర్త రిధమ్‌ దేశాయ్‌ చెప్పారు. కేవలం క్రూడాయిల్‌ ధరల్లో అనూహ్య పెరుగుదల మాత్రమే ఈ సైకిల్‌ను దెబ్బతీస్తుందని, లేదంటే బలమైన ఎర్నింగ్స్‌ వృద్ది కొనసాగుతుందని తెలిపారు. భారత మార్కెట్లపై బుల్లిష్‌గా ఉన్నామని, ఏడాది చివరకు సెన్సెక్స్‌ 42 వేల పాయింట్లకు చేరవచ్చని తెలిపారు. వచ్చే మూడేళ్లకు సరిపోయే పోర్టుఫోలియోలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్టీ, ఆటో, ఎంటర్‌టైన్‌మెంట్‌, కన్జూమర్‌ రంగాల స్టాకులను ఉంచుకోవాలని, ప్రస్తుతానికి టెక్నాలజీ, కమోడిటీలు, యుటిలిటీలను దూరంగా ఉంచాలని సిఫార్సు చేశారు. 

భారత మార్కెట్‌ను మూడు కీలక అంశాలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. 
1. క్యాపెక్స్‌ గ్రోత్‌ సైకిల్‌: ఇండియా ఇంక్‌ కొత్త ప్రాఫిట్‌ సైకిల్‌ ఆరంభంలో ఉంది. ఎన్నికల తర్వాత మిగులు నిధులు ఉన్న కంపెనీలు కొత్త సామర్ధ్యాలను పెంచుకుంటాయి. పెట్టుబడులు పెరిగేకొద్దీ మార్జిన్లు సైతం దూసుకుపోతాయి. 
2. ఎర్నింగ్స్‌ పునరుజ్జీవం: దేశ జీడీపీలో కార్పొరేట్‌ ప్రాఫిట్‌ వాటా 2- 3 శాతముంది. 2002లో సైతం జీడీపీలో కార్పొరేట్‌ ప్రాఫిట్స్‌ వాటా ఇంతే ఉంది. 2010లో ఈ వాటా అత్యధికంగా 8 శాతం చేరింది. ఇకమీదట కంపెనీల లాభాలు మెరుగుపడతాయి. వచ్చే నాలుగైదేళ్ల పాటు నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 20 శాతం చక్రీయ వార్షిక వృద్ది ఉండొచ్చు. 
3. ఎన్నికల ఫలితాలు: తాజా ర్యాలీ, వచ్చే ఎన్నికల్లో స్థిర ప్రభుత్వ అంచనాలను డిస్కౌంట్‌ చేస్తోంది. గత నెలాఖరకు ముందు ఇండియా ఎన్నికల్లో ఎలాంటి ప్రభుత్వం వస్తుందనే అంశమై స్పష్టత లేదు. కానీ ఫిబ్రవరి 27 ఎయిర్‌స్ట్రైక్స్‌ అనంతరం చాలా మార్పువచ్చింది. అందువల్ల ఈ దఫా మరోమారు సుస్థిర ప్రభుత్వమే రావచ్చు.
రిస్కులివే: ఇండియా వృద్ది గాధకు కీలక అవరోధం ముడిచమురు ధరలే. పీపా బ్రెంట్‌ క్రూడ్‌ ధర 75 డాలర్లను దాటితే ఇక్కట్లు తప్పవు. దీంతో పాటు స్థిర ప్రభుత్వం బదులు సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా ఇబ్బందులుంటాయి. ఇవికాకుండా అంతర్జాతీయంగా మందగమనం వచ్చిందంటే పైన చెప్పుకున్న గ్రోత్‌ సైకిల్‌ దెబ్బతింటుంది. You may be interested

టాప్‌ ట్రేడింగ్‌ ఐడియాలు

Wednesday 20th March 2019

బుధవారం మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ స్వల్పలాభంలో, నిఫ్టీ ఫ్లాట్‌గాను కొనసాగుతున్నాయి. మధ్యాహ్న ట్రేడింగ్‌ కోసం టాప్‌ ఐడియాలు మీకోసం... ఎడెల్‌వీజ్‌ రికమండేషన్లు: 1. ఎన్‌ఐఐటీ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1390. స్టాప్‌లాస్‌ రూ. 1310. 2. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3650. స్టాప్‌లాస్‌ రూ. 3050.  3. అపోలోటైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ., 238. స్టాప్‌లాస్‌ రూ. 213. కునాల్‌ బోత్రా రికమండేషన్లు: 1. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 555. స్టాప్‌లాస్‌ రూ. 520.  2.

రూపాయి ర్యాలీకి బ్రేక్‌: లాభాల్లో ఐటీ షేర్లు

Wednesday 20th March 2019

నష్టాల మార్కెట్లో ఐటీ ర్యాలీ చేస్తున్నాయి. రూపాయి ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడటం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 1.50శాతం పెరిగింది. డాలర్‌ మారకం రూపాయి విలువ ఆరు ట్రేడింగ్‌ సెషన్‌లో 161 పైసలు బలపడింది. అయితే రూపాయి భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌

Most from this category