News


పేలవ స్టాకుల్లో పెరిగిన రిటైలర్ల పెట్టుబడులు

Wednesday 26th June 2019
Markets_main1561544223.png-26593

ఈ ఏడాది అత్యంత అధ్వాన్న ప్రదర్శన జరిపిన స్టాకుల్లో అనూహ్యంగా రిటైలర్ల హోల్డింగ్స్‌ పెరిగిపోతున్నాయి. కొందరు అనలిస్టులు సైతం వీటి విషయంలో తప్పుగా ఊహించారు. ఇలాంటి పతనమైతున్న స్టాకుల ధరలను వాల్యూషన్లతో పోల్చి తప్పులో కాలేశారు. వీరిని చూసి గుడ్డిగా పలువురు రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం ఇలాంటి స్టాకుల్లో చేతులు కాల్చుకున్నారు. రిటైలర్లకు ఇలాంటి కంపెనీల్లో నెలకొన్న నిజ సమస్యల స్వరూపం తెలియదని, కేవలం స్టాక్‌ ధరను చూసి గుడ్డిగా కొనుగోలు చేస్తుంటారని ఐఐఎఫ్‌ఎల్‌ అనలిస్టు అభిమన్యు విశ్లేషించారు. ధర తగ్గిందని కొనడమే కానీ, కంపెనీ ఫండమెంటల్స్‌ పతనమైతున్నాయని గమనించరని, ఇలా మూలాలు బలహీన పడిన స్టాకుల ధరలు ఎంత దిగివచ్చినా వాల్యూషన్ల పరంగా ఖరీదైనవిగానే భావించాలని చెప్పారు. రిటైలర్లకు ఈ విషయాలు తెలియక వీటి వెంట పడుతుంటారన్నారు. 
రిటైలర్లు చేతులు కాల్చుకున్న స్టాకుల వివరాలు..

వీటిలో ఆర్‌కామ్‌ రిటైల్‌ హోల్డింగ్‌ 37.15 శాతానికి పెరిగింది. స్టాకు ఈ ఏడాది దాదాపు 90 శాతం పతనమైంది. అనీల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన పలు స్టాకుల్లో ఇదే ధోరణి కనిపించింది. వీటితో పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జైపీ అసోసియేట్స్‌ తదితరాల్లో కూడా రిటైలర్ల భాగస్వామ్యం పెరిగింది, వీటి ధరలు క్షీణించాయి. అయితే హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా షేర్లు భారీగా పతనమైనా, రిటైలర్ల వాటా కూడా గణనీయంగా తగ్గింది. సంస్థాగత ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు వదిలించుకునే షేర్లను రిటైలర్లు గుడ్డిగా కొంటారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నిపుణుడు దీపక్‌ చెప్పారు. ప్రమోటర్లకు, సంస్థాగత ఇన్వెస్టర్లకు కంపెనీ లోతుపాతులు తెలుసు కనుక తెగబడి అమ్ముతారని, రిటైలర్లకు విషయం తెలీక చౌకగా వస్తున్నాయని కొనుగోలు చేస్తారని చెప్పారు. పోర్టుఫోలియలో ఇలాంటి షేర్లను చేర్చుకొని అవి మరింత పతనం కాగానే యావరేజ్‌ చేయడం రిటైలర్లకు పరిపాటి అని, చివరకు ఇలాంటి షేర్లను కొన్న రిటైలర్లు నష్టాలను మూటకట్టుకోవడమే జరుగుతుంటుందన్నారు. You may be interested

రెండోరోజూ అదే జోరు

Wednesday 26th June 2019

మార్కెట్‌ ర్యాలీ రెండోరోజూ కొనసాగింది. సూచీలు బుధవారమూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో39,592 వద్ద. నిప్టీ 51.10 పాయింట్లు పెరిగి 11,847.55 వద్ద స్థిరపడ్డాయి. నైరుతి రుతుపవనాలు శరవేగంగా ఉత్తర, మధ్య భారతదేశమంతటా విస్తరించాయనే ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర సానుకూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో మెటల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌,

రివకరి బాటలో అడాగ్‌ గ్రూప్‌ షేర్లు

Wednesday 26th June 2019

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టపోయిన అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో రికవరి బాట పట్టాయి. ఈ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ పవర్‌,  రిలయన్స్‌  క్యాపిటల్‌ షేర్లు 20శాతం నుంచి 13శాతం ర్యాలీ చేశాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఎఫ్‌అండ్‌ఓ సెక్యూరిటీస్‌ విభాగంలో టాప్‌-10 గెయినర్లలో మూడు షేర్లు మొదటి మూడు స్థానాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.  రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

Most from this category