News


రిటైల్‌ ఇన్వెస్టర్లు మక్కువ చూపిన షేర్లివే!

Friday 18th October 2019
Markets_main1571381859.png-28980

యస్‌బ్యాంకుపై అధికాసక్తి
సెప్టెంబర్‌ త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ సహా కొన్ని షేర్లపై రిటైలర్లకు మక్కువ పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. తాజాగా యస్‌బ్యాంకులో రిటైలర్‌ మదుపరుల సంఖ్య 13లక్షలను దాటింది. బడా కంపెనీలైన ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాదారుల్లో రిటైలర్ల సంఖ్య కన్నా యస్‌బ్యాంకులో రిటైల్‌ వాటాదారుల సంఖ్య ఎక్కువ. యస్‌బ్యాంకుతో పాటు బీఓబీ, విప్రో, టాటామోటర్స్‌, టీసీఎస్‌, బయోకాన్‌ తదితరాల్లో క్యు2లో పెరిగింది. రిటైల్‌ ఓనర్‌షిప్ పరంగా యస్‌బ్యాంకు ప్రస్తుతం దేశీయంగా ఐదో అతిపెద్దబ్యాంకుగా మారింది. యస్‌బ్యాంకు కన్నా అధికంగా రిటైలర్లున్న కంపెనీలుగా వరుసగా ఆర్‌పవర్‌, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, ఆర్‌కామ్‌ ఉన్నాయి. ఆర్‌పవర్‌లో దాదాపు 31 లక్షల మంది రిటైల్‌ వాటాదారులున్నారు. 
క్యు2లో రిటైల్‌ వాటాదారుల సంఖ్య పెరిగిన స్టాకుల వివరాలు...

రిటైలర్ల భరోసా
యస్‌బ్యాంక్‌  షేరు ఏడాదిలో దాదాపు 80 శాతం పతనమైంది. దీంతోపాటు ప్రధాన ప్రమోటర్‌ తన వాటాను గణనీయంగా తగ్గించుకున్నారు. కానీ బ్యాంకు కొత్త యాజమాన్యం సంక్షోభాలను దాటిస్తుందని రిటైలర్లు నమ్ముతున్నారు. ఈ నమ్మకంతో క్యు2లో రిటైల్‌ ఇన్వెస్టర్లు దాదాపు 26.40 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో హెచ్‌ఎన్‌ఐలు 2.53 కోట్ల షేర్లు కొన్నారు. దీంతో క్యు2లో బ్యాంకు వాటాదారుల్లో రూ.2 లక్షలలోపు పెట్టుబడి కలిగిన రిటైల్‌ వాటాదారుల షేర్ల సంఖ్య 69.80 కోట్లకు పెరిగింది. క్యు1లో ఇది 43.40 కోట్లు మాత్రమే ఉంది. వీరి వాటా శాతం 20.46 శాతం నుంచి 29.94 శాతానికి పెరిగింది. ఇక ఇతర ప్రధాన వాటాదారుల్లో ఎల్‌ఐసీ క్యు2లో యస్‌బ్యాంకులో తన వాటాను 8.87 శాతం నుంచి 8.06 శాతానికి తగ్గించుకుంది. ఎఫ్‌ఐఐల వాటా 33.69 శాతం నుంచి 26.51 శాతానికి తగ్గింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 6.59 శాతం నుంచి 9.26 శాతానికి పెరిగింది. You may be interested

‘‘జీ’’ షేర్లకు క్యూ2 ఫలితాల షాక్‌..!

Friday 18th October 2019

మీడియా రంగంలో సేవలు అందిస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటడ్‌ షేర్లకు క్యూ2 ఫలితాల ప్రకటన సెగ తగలింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 9శాతానికి పైగా నష్టపోయాయి. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రకటించింది. ఆదాయ వృద్ధి నెమ్మదించడం, బలహీన నిర్వహణ మార్జిన్ల కారణంగా రెండో క్వార్టర్లో కంపెనీ నికర లాభం 7 శాతమే పెరిగి రూ. 413

ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ 18.82% ర్యాలీ

Friday 18th October 2019

 ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలలో మెచ్యుర్‌ కాబోతున్న ఎన్‌సీడీ(నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌)లను ముందుగానే విడిపించేందుకు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సిద్ధమవుతుండడంతో ఈ కంపెనీ షేరు విలువ శుక్రవారం ట్రేడింగ్లో 18.80 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ. 235.20 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 14.4 శాతం జంప్  చేసి 197.95 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 198.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో

Most from this category