News


యస్‌ బ్యాంక్‌లో ఇరుక్కున్న చిన్న ఇన్వెస్టర్లు

Friday 6th March 2020
Markets_main1583490439.png-32334

డిసెంబర్‌ త్రైమాసికానికల్లా 48 శాతానికి రిటైల్‌ వాటా
2018 జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 8.8 శాతమే
సుజ్లాన్‌ ఎనర్జీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌కామ్‌ తరహాలోనే..

వేల్యూ బయింగ్‌ పేరుతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో పెట్టుబడులకు దిగుతూ వచ్చిన రిటైల్‌ ఇన్వెస్టర్లు చివరికి బిక్కమొహం వేయవలసిన పరిస్థితులు తలెత్తినట్లు మార్కెట్‌ విశ్లేషకులు తాజాగా వ్యాఖ్యానిస్తు‍న్నారు. ఒకప్పుడు మార్కెట్‌ ఫేవరెట్‌గా నిలవడంతోపాటు ఏకంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో భాగమైన యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ గత కొద్ది నెలలుగా డీలా పడుతూ వస్తోంది. బ్యాంకులో అక్రమాలు చోటు చేసుకున్న కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ తొలిగా బ్యాంక్‌ ప్రమోటర్‌ రాణాకపూర్‌ పదవిలో కొనసాగేందుకు చెక్‌ పెట్టింది. తదుపరి బ్యాంక్‌ కార్యకలాపాలు పలు కుదుపులకు లోనవుతూ వచ్చాయి. తాజాగా యస్‌ బ్యాంక్‌ బోర్డును రిజర్వ్‌ బ్యాంక్‌ రద్దు చేయడంతోపాటు.. ఖాతాదారులు ఏప్రిల్‌ 3 వరకూ రూ. 50,000కు మించి నగదును ఉపసంహరించుకునేందుకు వీలులేకుండా కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యస్‌ బ్యాంక్‌ షేరు ఉన్నపళాన కుప్పకూలింది. రూ. 37 నుంచి ఒకే రోజులో రూ. 5.7కు దిగజారింది. నిజానికి యస్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు కొనసాగేందుకు వీలుగా.. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌, బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ రంగంలోకి దిగేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెలువడిన వార్తలు ఈ కౌంటర్‌లో పతనాన్ని అడ్డుకోలేకపోయినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 

రిటైలర్ల జోరు
యస్‌ బ్యాంక్‌ పనితీరు జోరు మీదున్న కాలంలో అంటే 2018 జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్‌ చేశారు. తదుపరి బ్యాంకులో అవకతవకలపై సందేహాలతో పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతూరాగా.. మరోవైపు చిన్న ఇన్వెస్టర్లు షేరు దర అందుబాటులోకి వస్తున్న భావనతో కొనుగోలు చేస్తూ వెళ్లినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి 2019 డిసెంబర్‌ త్రైమాసికానికల్లా యస్‌ బ్యాంక్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా దాదాపు 48 శాతానికి చేరింది. 2018 జూన్‌లో ఈ వాటా 8.83 శాతమే కావడం గమనార్హం! కాగా.. గతంలోనూ సుజ్లాన్‌ ఎనర్జీ, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తదితర కౌంటర్లలోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో వాటాలు కొనుగోలు చేయగా.. ఇటీవల ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌,  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ తదితర కౌంటర్లలోనూ భారీగా పెట్టుబడులు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

వాటా పెరిగిందిలా

త్రైమాసికం    రిటైల్‌ వాటా(%)
డిసెంబర్‌ 2019     47.96
సెప్టెంబర్‌    2019     29.94
జూన్‌    2019     20.46
మార్చి 2019     13.96
డిసెంబర్‌ 2018  16.27
సెప్టెంబర్‌ 2018     11.19
జూన్‌    2018  8.83

    You may be interested

నిఫ్టీ టార్గెట్‌ను కుదించిన ఎడెల్వీజ్‌.!

Friday 6th March 2020

ఈ డిసెంబర్‌ నాటికి 12వేల స్థాయికి..! కరోనా వైరస్‌ దలాల్‌ స్ట్రీట్‌ను తాకడంతో పాటు తన విధ్వంసాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ అనూహ్య పరిణామంతో మార్కెట్‌ విశ్లేషకులు 2020 ఏడాదికి నిఫ్టీ స్థాయి అంచనాలను మరోసారి పునఃపరిశీలించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ నిఫ్టీ అంచనాలను తగ్గించుంది. ఏడాది చివరి నాటికి 12300 స్థాయికి చేరుకుంటుందనే గత అంచనాలను సవరిస్తూ 12000 స్థాయికి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.  ఆదాయాలు

ఫోన్‌పే పై యస్‌ బ్యాంక్‌ దెబ్బ!

Friday 6th March 2020

 యస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఫోన్‌పే సేవల్లో అంతరాయం ఏర్పడింది.  ఫోన్‌పే సహవ్యవస్థాపకులు, సీఈఓ  సమీర్‌ నిగమ్‌ శుక్రవారం ట్విటర్‌లో స్పందిస్తూ ఫోన్‌పే సేవల్లో అంతరాయం ఏర్పడినందుకు చింతిస్తున్నామని త్వరలోనే సేవలను పునరుద్దరిస్తామని తమ ఖాతాదారులకు తెలిపారు. మా భాగస్వామ్య బ్యాంక్‌ అయిన యస్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మా టీమ్‌ మొత్తం రాత్రింబవళ్లు

Most from this category